Relationship Tips: రిలేషన్‌షిప్లో కొన్ని అబ్బాయిలకు నచ్చినవి అమ్మాయిలకు నచ్చవు. అలాగే అమ్మాయిలకు నచ్చినవి అబ్బాయిలకు నచ్చవట. ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆ జంట కలకాలం కలిసిఉంటుంది. ఈరోజు మనం అమ్మాయిలకు నచ్చని అబ్బాయిల పనులు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఏ అమ్మాయిలు తనకు ఇష్టమైనవాళ్లు అనకూడని మాటలు అంటే భరించలేరు. ఇది అర్థం చేసుకోకుండా కొందరు అబ్బాయిలు అమ్మాయిలపై నోరు పారేసుకుంటారు.


కొంతమంది అమ్మాయిలు అంటేనే చాలా చులకనగా చూస్తారు. ఏ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు. వీళ్ల వల్ల ఏం అవుతుందిలే అన్నట్లు చిన్నచూపు చూస్తారు. ఈ వ్యక్తిత్వం ఉండే అబ్బాయిలు అమ్మాయిలకు అస్సలు నచ్చరట.


ఇదీ చదవండి: Get Rid of Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి అద్భుతమైన టిప్స్.. కొన్నిరోజుల్లోనే చర్మం మచ్చలేకుండా కనిపిస్తుంది..


కెరీర్ అంటే లైట్ తీసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. ఈ వైఖరి ఉండే వ్యక్తులు కూడా అమ్మాయిలకు అస్సలు ఇష్టపడరట.


అంతేకాదు రిలేషన్‌షిప్లో కొంతమంది అబ్బాయిలు తాము చెప్పిందే వేదం అన్నట్లు నడుచుకోవాలని ఆంక్షలు పెడతారు. అమ్మాయికి ఇష్టం ఉందా? లేదా? ఆలోచించరు. బలవంతపు అయిష్టాలను వారిపై రుద్దుతారు. ఇలాంటి వ్యక్తులు కూడా అమ్మాయిలకు నచ్చరు.


అమ్మాయిలకు వాళ్లు ఫోన్ చేసినప్పడు లేదా మెసేజ్ పెట్టినప్పుడు వెంటనే స్పందించాలని కోరుకుంటారట. లేకపోతే వారికి వెంటనే కోపం వస్తుంది.


ఇదీ చదవండి: 7 Snakes Give Live Birth: ఈ 7 పాములు గుడ్లను కాదు.. పిల్లలను పెడతాయట..


కొంతమంది అబ్బాయిలైతే ప్రతి విషయానికి గొడవ పెట్టుకుంటారు. చికాకుగా తీసి పడేస్తారు. అలాంటివారు కూడా అమ్మాయిలకు ఇష్టం ఉండదు.


చివరిది కానీ, అత్యంత ముఖ్యమైనది సాధారణంగా అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలు రోడ్డుపై అందంగా కనిపిస్తే వారి వంకే చూస్తారు. ఈ సమయంలో కూడా అమ్మాయిలకు బాగా కోపం వస్తుందట.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook