How to Remove Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ సమస్య చాలామందిని వేధిస్తుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత ప్రతిఒక్క మహిళ స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడుతుంది. కొన్ని హోం రెమిడీస్‌తో సులభంగా స్ట్రెచ్ మార్క్స్ సమస్యను అధిగమించవచ్చు.
బంగాళాదుంప ..
స్ట్రెచ్ మార్క్స్ సమస్య ఉన్నవాళ్లు బంగాళాదుంప రసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. ఈ గుర్తులను తొలగించడానికి ఉత్తమ ఇది బెస్ట్ హోం రెమిడీ. దీనికి బంగాళదుంప రసంలో పసుపు కలిపి స్ట్రెచ్ మార్క్స్ గుర్తులపై రాయాలి. దీంతో కొన్ని రోజుల్లోనే మంచి ప్రభావం కలుపుతుంది.
కలబంద..
అలోవెరా జెల్‌ను స్ట్రెచ్ మార్క్స్ పై రాస్తే కూడా మంచి ప్రభావం కనిపిస్తుంది. చర్మంపై ఈ గుర్తులను తొలగించడానికి కలబంద వల్ల ఈ గుర్తులు త్వరగా మాయమవుతాయి.. కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద అప్లై చేయాలి. ఇలా రోజూ రాత్రి అప్లై చేసి ఉదయం శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో చర్మం కూడా సహజంగా మెరుస్తూ ఉంటుంది.
ఇదీ చదవండి: Plant Keeps Rats Away: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎలుకలు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు..
టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్‌లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ పై రుద్దండి. ఇలా చేయడం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ త్వరలో మాయమవుతాయి.
బేకింగ్ సోడా ..
బేకింగ్ సోడా అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని స్ట్రెచ్ మార్క్స్‌పై సున్నితంగా రుద్దండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఈ గుర్తులు తొలగిపోతాయి.
ఇదీ చదవండి: Intelligent Women Nature: తెలివైన స్త్రీలు మాత్రమే ఈ 5 పనులు ఎప్పుడూ చేస్తారట..
పసుపు ..
పసుపు ప్రతి వంటగదిలో ఉండే ఆహార పదార్థం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించుకోవడానికి కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ చేయండి. స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా తగ్గిపోతాయి. ఈ గుర్తులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పసుపు పనిచేస్తుంది..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter