Tips And Tricks: మీ ఇంట్లో తప్పుపట్టిన పాత్రలు ఉన్నాయా..ఇలా సులభంగా వదిలించండి..!!
Tips And Tricks: ఇనుములో నీరు లేదా ద్రవాలు చేరినప్పుడు అది చేడిపోయి తుప్పుపడుతుంది. దీని కారణంగా అందులో వంటలు చేసుకున్నప్పుడు శరీరానికి హాని కలిగుతుంది. అయితే చాలా మంది ఐరన్ పాత్రల్లో ఆహారం వండుకుని తినడానికి ఇష్టపడతారు. ఐరన్ పాత్రల్లో వండిన ఆహారం శరీరంలో ఐరన్ లోపాన్ని తీరుస్తుందని వారి నమ్మకం.
Tips And Tricks: ఇనుములో నీరు లేదా ద్రవాలు చేరినప్పుడు అది చేడిపోయి తుప్పుపడుతుంది. దీని కారణంగా అందులో వంటలు చేసుకున్నప్పుడు శరీరానికి హాని కలిగుతుంది. అయితే చాలా మంది ఐరన్ పాత్రల్లో ఆహారం వండుకుని తినడానికి ఇష్టపడతారు. ఐరన్ పాత్రల్లో వండిన ఆహారం శరీరంలో ఐరన్ లోపాన్ని తీరుస్తుందని వారి నమ్మకం. కానీ ఇనుప పాత్రలో ఆహారాన్ని నిరంతరం వండడం వల్ల అది తుప్పు పట్టిపోతోంది. ఇది శుభ్రపర్చడం కష్టంగా మారుతోంది. మీరు కూడా ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే.. ఈ స్టోరిలో పేర్కొన్న విధంగా తుప్పును సులభంగా శుభ్రం చేసుకోండి..
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
మొదటిద మీరు తుప్పును శుభ్రం చేయాలనుకుంటున్న పాత్రలను నీటితో శుభ్రం చేయండి. శుభ్రపరిచిన తర్వాత ఈ పాత్రను ఎండలో ఉంచండి. ఆ తర్వాత మీరు వాటిని తలక్రిందులుగా ఉంచండి. తద్వారా అందులో ఉన్న నీరు క్రిందికి వెళ్లిపోతాయి.
బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి:
బేకింగ్ సోడా కేవలం ఆహారంలో మాత్రమే వాడడం కాకుండా..ఇనుప పాత్రలలోని తుప్పును కూడా శుభ్రం చేయడానికి వాడతారు.
ఎలా ఉపయోగించాలి:
- ముందుగా రెండు కప్పుల వేడి నీటిని తీసుకోవాలి. ఆ తర్వాత రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు బ్రష్ సహాయంతో తుప్పు పట్టిన ప్రదేశంపై ఈ పేస్ట్‌ను పోయాలి. పోసిన తర్వాత కాసేపు అలాగే ఉంచండి.
- 5 నుంచి 7 నిమిషాల తర్వాత, బ్రేష్ సహాయంతో గట్టిగా రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసి సుమారు 20 నుంచి 25 నిమిషాలు ఎండలో ఉంచండి.
బేకింగ్ సోడా, సున్నంతో ఇలా శుభ్రం చేయండి:
ఏదైనా ఇనుప పాత్ర నుంచి తుప్పును తొలగించడానికి సున్నం, బేకింగ్ సోడా ఎంతగానో తోడ్పడుతాయి. దీని కోసం మీరు మొదట రెండు చెంచాల సున్నం తీసుకొని దానికి ఒక చెంచా బేకింగ్ సోడా కలపండి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని తుప్పు పట్టిన ప్రదేశంలో అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు పాత బ్రష్ సహాయంతో స్క్రబ్ చేయండి. అంతే తుప్పు మొత్తం తొలగిపొతుంది.
Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!
Also Read: Curd Benefits For Hair: పెరుగుతో జుట్టుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.