Couple Tips: మీ మ్యారేజ్ లైఫ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చే బ్యూటిఫుల్ టిప్స్..
Couple Goals: భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి సర్వసాధారణం. అయితే కొందరి విషయంలో అవి లాంగ్ టైమ్ సాగుతూ ఉంటే.. మరికొందరి విషయంలో పాలపొంగులా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎలాంటి గొడవలైన ఒక్కసారి గదిలోకి వెళ్ళాక సాల్వ్ అవ్వాల్సిందే అంటాయి కొన్ని జంటలు. మరి ఆ సీక్రెట్ ఏమిటో మనం కూడా తెలుసుకుందాం..
Happy Marriage Life Tips:భార్యాభర్తల మధ్య అరమరికలు అస్సలు ఉండకూడదు అంటారు. అయితే నిజానికి ఉండకూడనిది ఏంటో తెలుసా.. మౌనం. ప్రస్తుతం బిజీ లైఫ్ ఎక్కువ అవుతున్న కొద్ది ప్రతి ఒక్కరు కాస్త టైం దొరికిన ఫోన్లకి అంటుకుపోతున్నారు. తమ లైఫ్ పార్ట్నర్ కోసం వాళ్ళ దగ్గర ఐదు నిమిషాల టైం కూడా ఉండడం లేదు. వీటి ప్రభావం నేరుగా వాళ్ళ సెక్స్ లైఫ్ పై పడుతుంది. ఈ ఒక్క విషయం సరిగ్గా ఉంటే భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ అయినా చిటికెలో మాయమైపోతుంది. మరి మీ బెడ్ రూమ్ ముచ్చట్లు సరిగ్గా సాగాలి అంటే కొన్ని పనులు కచ్చితంగా పాటించాలి. అవేమిటంటే..
సర్దుకుపోవాలి:
పెళ్లి అనగానే సినిమాలోని సీరియల్ లోనో చూపించినట్టు అన్ని వాటి అంతటవే జరిగిపోవు. మనమే అన్ని పనులు సాఫీగా సాగేలా చూసుకోవాలి. చిన్నచిన్న గొడవలను అక్కడితో వదిలేయడం నేర్చుకోవాలి.. సంసారం అన్నాక సమస్యలు రావడం సహజమే.. అయితే వీటన్నిటినీ దాటుకొని పోయే నేర్పు భార్యకే కాదు భర్తకి కూడా ఉండాలి.
టైం:
ప్రపంచంలో అత్యంత విలువైనది ఒకసారి ఖర్చు పెడితే మళ్లీ తిరిగి రానిది టైం. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం గంటలు గంటలు గడిపే మనం మన కోసం ఇంటి వద్ద ఉండే భాగస్వామితో ఐదు నిమిషాలు గడపడానికి తెగ సతమతమైపోతాం. ప్రతిరోజు మీ భాగస్వామి కోసం కొంత సమయాన్ని కేటాయించడం ఎంతో ముఖ్యం. మీ రోజు ప్రారంభం కలిసి కాఫీ తాగడంతో మొదలు పెట్టాలి.. నవ్వుతూ ఆనందంగా నాలుగు మాటలు మాట్లాడుకోవాలి. అలాగే ప్రతిరోజు పడుకునే ముందు ఆరోజు జరిగిన విషయాల గురించి కాసేపు మాట్లాడుకోగలగాలి.
టచ్:
ప్రపంచంలో పసిపిల్ల వాడికి ఏ కష్టం వచ్చినా మొదట అమ్మ కోసం వెతుకుతాడు.. అమ్మ కౌగిలిలో ఉన్న సుఖం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది.. ఇదే టచ్ కి ఉన్న పవర్. మీ భాగస్వామితో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్.. అదేనండి టచ్ కమ్యూనికేషన్.. ఐ కమ్యూనికేషన్.. మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. ఒక్కసారి మనకు నచ్చిన వ్యక్తి మనల్ని హగ్ చేసుకుంటే మనసులో ఉన్న డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం , చేతులు పట్టుకోవడం.. ఇలాంటి చిన్న చిన్న నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి.
ట్రిప్స్:
అప్పుడప్పుడు కాస్త అలా బయటకు వెళ్లి రావడం మనసుకు ఎంతో శాంతిని చేకూరుస్తుంది. మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుంది. మీరు మీ భాగస్వామితో వెళ్లే ట్రిప్స్ కాస్త రొమాంటిక్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి.
ఇలా అప్పుడప్పుడు కాస్త రొటీన్ కి భిన్నంగా మీ రిలేషన్ ని డెవలప్ చేసుకోవడం.. మీ సెక్స్ లైఫ్ ను మరింత జాలి రైడ్ గా మారుస్తుంది.
Also read: High Bp: హై బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను ట్రైచేసి చూడండి..
Also read: New year Wishes 2024: కొత్త ఏడాదిలో మీ స్నేహితులు, బంధువులకు ఇలా విషెస్ అందించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook