Skincare Juices For Beauty: చర్మం అందంగా ఉండటం చాలా అవసరం అనుకుంటారు చాలా మంది. కానీ అందంతో పాటు ఆరోగ్యకరమైన చర్మం         పొందడం చాలా అవసరం. దీని కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చర్మ నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారం వల్ల చర్మం అందంగా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించి మీ చర్మని రక్షించుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త‌గినంత నీరు:  చర్మం అందంగా కనిపించాలి అంటే శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. దీని వల్ల వ్యర్థ పదార్థాలు తొలిగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ 4 లీట‌ర్ల నీరు తాగ‌డం వ‌ల్ల చ‌ర్మ అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డ్రై స్కిన్, చ‌ర్మం జిడ్డు కారడం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.


దీంతో  పాటు చ‌ర్మ ఆరోగ్యం కోసం కొన్ని ర‌కాల జ్యూస్ ల‌ను తాగాలి. దీని కారణంగా అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు. ప్రతిరోజూ ఉదయం క్యారెట్‌, బీట్‌ రూట్‌ తో  తయారు చేసిన జ్యూస్‌ తాగడం ఎంతో మేలు చేస్తుంది. చర్మం కాంతివంగా కనిపిస్తుంది.


Also read:  Keep Your Body Warm During Winter: చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచే పదార్థాలు ఇవే!


అలాగే ట‌మాటాలు, కీర‌దోస‌తో జ్యూస్ చేసి తీసుకోవాలి. దీంతో త‌గినంత విట‌మిన్ ఎ ల‌భిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
సాయంత్రం ఆరెంజ్, బ‌త్తాయి వంటి వాటితో జ్యూస్ ను తీసుకోవాలి. దీని కారణంగా విట‌మిన్ సి ల‌భిస్తుంది.  చర్మ సమస్యలను దరిచేరకుండా రక్షిస్తుంది.


ఈ విధంగా జ్యూస్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. జ్యూస్ ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి  క్రీములు, చర్మ ప్రొడెక్ట్స్‌ను  వాడే అవ‌స‌రం లేకుండా అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంద‌ని చర్మనిపుణులు చెబుతున్నారు.


Also read: Bhogi Mantalu 2024: భోగిమంట వేసేవారు చేయకూడని తప్పులు ఇవే..తప్పకుండా గుర్తుంచుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter