Effective Ways To Stay Warm During Winter: చలికాలంలో వాతావరణం కారణంగా మనలో చాలా మందికి బద్దకంగా ఉంటుంది. దీని కారణంగా ఏ పనిలోను శ్రద్థా చూపించకుండా ఉంటారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం మనం రోజు తినే ఆహారంలో మసాలా దినుసులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. దీని కారణంగా శరీరాం శక్తివంతంగా మారుతుంది. ఎలాంటి మసాలా దినుసులు ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
దాల్చిన చెక్క: శీతాకాలంలో దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల శరీరం ఎల్లప్పుడు వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పసుపు: ప్రతిరోజు వంటల్లో వాడే ఈ పసుపును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్పెక్షన్ బారిన పడకుండా ఉంచుతుంది.
యాలకులు: ఈ యాలకులను తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఉత్సాహంగా ఉండేలా చేయడంలో యాలకులు సహాయపడుతాయి.
మిరియాలు: మిరియాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Also read: Tea And Coffee: టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
జీలకర్ర: శీతాకాలంలో చాలా మంది అలసట బారిన పడుతుంటారు. జీలకర్ర తీసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.
ధనియాలు: చలికాలంలో జ్వరం బారిన పడుతుంటారు. దీని కారణంగా విటమిన్లు కోల్పతుంటారు. అయితే ధనియాలు తీసుకోవడం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి.
ఆవాలు: జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపరచడంలో ఆవాలు ఎంతో ఉపయోగపడుతాయి. దీని వల్ల బద్దకం, నీరసం, అలసట తగ్గుతుంది.
ఈ విధంగా శీతాకాలంలో ఈ మసాలా దినుసులను తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Rusted Water Taps: ఈ టిప్స్‌ను పాటించడం వల్ల మీ ఇంట్లో తుప్పు పట్టిన ట్యాప్స్ మిల మిల మెరవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter