Children’s day special: ఈసారి చిల్డ్రన్స్ డే కోసం మీరు‌‌.. మీ పిల్లలకు.. ఏవైనా విద్యా సంబంధిత కాని.. వాడికి ఆనందం కలిగించే వంటివి కానీ.. ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లయితే, కింద చెప్తే గిఫ్ట్ ఐడియాస్ మీకోసమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథాల పుస్తకాలు: 
పిల్లలు రంగురంగుల చిత్రాలతో కూడిన కథలను చదవడం ఇష్టపడతారు. పిల్లల దినోత్సవం సందర్భంగా.. వారి వయస్సు, వారికి ఇష్టమైన వాటి
ప్రకారం కథా పుస్తకాలను ఇవ్వడం మంచి ఆలోచన. ఈ పుస్తకాలు వారికి కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో ఉపయోగపడతాయి. 


2. డ్రాయింగ్ లేదా కలరింగ్ బుక్‌లు: 
డ్రాయింగ్ లేదా కలరింగ్ బుక్స్ పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి. పిల్లలు రంగుల వేసుకోవడం, చిత్రాలను గీయడం.. చాలా ఇష్టపడతారు. ఇక ఇలా రంగుల వెయ్యడం.. వారి మేధస్సును ప్రేరేపిస్తుంది.. వారి సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ముఖ్యంగా ఈ పుస్తకాలు వారి ఊహశక్తి పెంపొందించడం లో సహాయపడతాయి.


3. రంగుల పెన్సిల్స్, క్రాయాన్స్, బ్రష్‌లు:
 
పిల్లలకు రంగుల పెన్సిల్స్, క్రాయాన్స్ లేదా బ్రష్‌లు ఇవ్వడం కూడా మంచి ఆలోచన. చిన్న పిల్లలు చదవడం కన్నా, డ్రాయింగ్.. కలరింగ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఈ బహుమతులు వారిలో సృజనాత్మకతను పెంచడంలో మరింత ఉపయోగపడతాయి.


4. అక్షరాలు లేదా సంఖ్యలు పజిల్స్:
అక్షరాలు లేదా సంఖ్యలు పజిల్స్.. పిల్లలకు సరదాగా నేర్చుకునే ఒక మంచి సాధనంగా మారుతాయి. ఈ పజిల్స్ పరిష్కరించడం వల్ల.. పిల్లల ఆలోచనా శక్తి.. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాం పెరుగుతుంది. హై


ఈ ప్రత్యేకమైన బహుమతులు పిల్లల దినోత్సవం సందర్భంగా పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయి. వారు మాత్రమే కాకుండా, మీరు కూడా వారితో పాటు పైన చెప్పినవి చేసి.. వారికి మరింత ఆనందాన్ని కలిగించడమే కాకుండా.. వారికి ఎన్నో విషయాలను కూడా నేర్పించవచ్చు.


Also Read : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


Also Read : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి