Hair Care Tips: వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? నిపుణులు సూచించిన చిట్కాలు ఇవే
summer hair care tips: వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి లోనైతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు వినియోగించండి.
summer hair care tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టును ఆరోగ్యంగా పొడవుగా ఉంచుకోవడానికి వివిధ రకాల ఖరీదైన ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వినియోగిస్తారు. అయినప్పటికీ కొంతమందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా సమ్మర్లోనైతే ఎక్కువగా జుట్టు రాలడం వంటి ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వేసవికాలంలో పలు రకాలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమస్యలు స్త్రీలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వారు తప్పకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో కొంతమందిలో జుట్టు సమస్యలు రావడానికి ప్రధాన కారణం వాతావరణ కాలుష్యమేనని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వేసవికాలంలో సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాలు నేరుగా జుట్టు పై పడటం కారణంగా కొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జుట్టు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి..
వేసవి సమయంలో చాలామంది బయటికి వెళ్లే క్రమంలో సదాగా వెళుతూ ఉంటారు. ఇలా వెళ్లడం అంత మంచిది కాదనిఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో నేరుగా తలపై పడడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు వేసవికాలంలో బయటికి వెళ్లే క్రమంలో తలపై టోపీని ధరించడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా షాంపును వినియోగించండి..
స్నానం చేసే క్రమంలో విచ్చలవిడిగా తలకు షాంపూని వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా ఎక్కువగా వినియోగించడం వల్ల ఎండ కారణంగా జుట్టులో వచ్చే చెమట ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వేసవి కాలంలో తలస్నానం చేసే క్రమంలో షాంపూను తక్కువ మోతాదులో వినియోగించాల్సి ఉంటుంది. అలాగే తల స్నానం చేసే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపులను వినియోగించడం ఎంతో మంచిది.
జుట్టుకు నూనె తప్పనిసరి..
కొంతమంది జుట్టుకు నూనె పెట్టడం మానుకుంటారు. నిజానికి దీని కారణంగా కూడా జుట్టు సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు..సమ్మర్ లో తప్పకుండా జుట్టుకు నూనెను పెట్టడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి