Unhealthiest Breakfast Foods: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!
Unhealthy Breakfast Foods: సాధారణంగా ఉదయం పూట మనం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాం. కొందమంది ఉదయం పూట తినే అలవాటు ఉండదు. అయితే ఉదయం ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Unhealthy Breakfast Foods: ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం వల్ల శరీరం ఎంతో చురుకుగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొంతమంది బ్రేక్ ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటారు. మరి కొంతమంది అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ఆయిల్ ఫూడ్స్, జంక్ ఫూడ్స్ ను తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.
పెరుగు: చాలామంది ఉదయం పూట పెరుగు తింటూ ఉంటారు. పెరుగులో ప్రొటీన్లు, విటమిన్ బి-12 అధికంగా లభిస్తుంది. దీనిని ఖాళీ కడుపుతో పెరుగును బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏదైన ఆహరం తీసుకున్న తర్వాత పెరుగుతో చేసిన పదార్థాలను తీసుకోవచ్చు.
పుల్లటి పండ్లు: బ్రేక్‌ఫాస్ట్‌గా పుల్లటి పండ్లను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అసిడిటీ, గ్యాస్, గుండెలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
వైట్ బ్రెడ్: బ్రేక్‌ఫాస్ట్‌గా చాలామంది వైట్ బ్రెడ్‌ను తీసుకుంటారు. అయితే నిపుణుల ప్రకారం వైట్ బ్రెడ్‌ను తీసుకోవడం వల్ల అస్సలు తినకుండా ఉండాలి. ఈ వైట్ బ్రెడ్ పిండితో తయారు చేస్తారు. దీని వల్ల తక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.
స్వీట్లు: ఉదయం పూట స్వీట్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు స్వీట్లును తినకుండా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Tamarind Seeds: మంగు మచ్చలను తొలగించడంలో ఈ గింజలు ఎంతో ఉపయోగపడుతాయి!
ప్రాసెస్ ఫూడ్స్: చిన్న పిల్లలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం లేదని పెద్దలు వారిని చిప్స్, బన్, డోనట్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా పెడుతారు. ఇలా ప్రాసెస్ ఫూడ్స్ చేయడం వల్ల శరీరానికి మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తపోటు సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
ఈ విధంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఈ పదార్థాలను తీసుకోకుండా ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Pongal recipe: పొంగల్ ను ఇలా తయారు చేసి చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter