Long & Shiny Hair: వాతావరణం లో మార్పుల వల్ల జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారుతుంది. ఇది జుట్టు పెరుగుదల కుంటుపడేలా చేస్తుంది. ఇవాళ చాలామంది హెయిర్ ఫాల్స్ డాండ్రఫ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా జుట్టును అందంగా మార్చుకోవచ్చు.వేలు ఖర్చుపెట్టి కెరటిన్‌, స్ట్రెయిటెనింగ్‌ చేసుకున్న అవి కొన్ని రోజులు మాత్రమే ఫలితాలను ఇస్తాయి. ఆ తర్వాత ఎప్పటిలాగే మారిపోతుంది. జుట్టు సమస్య అలాగే ఉంటుంది. అయితే ఇంట్లో కొన్ని రకాల వస్తువులతో ఈజీగా జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా పెరుగుతుంది అది ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలబంద మాస్క్..
కలబంద జెల్ ని ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కూడా వేసి మంచిగా మందపాటి పేస్టు మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టు అంతటికీ బాగా పట్టించాలి చివర్ల వరకు ఇలా అప్లై చేయాలి ఓ అరగంట తర్వాత . ఇది ప్రతిసారి మీరు తల స్నానం చేసినప్పుడల్లా ఈ పద్ధతిని అనుసరించాలి.


ఎగ్ మాస్క్..
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర కప్పు తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని జుట్టు చివర్ల నుంచి కుదుళ్ల వరకు బాగా అప్లై చేసి అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీళ్లు  నార్మల్ షాంపూ పెట్టి తల స్నానం చేసుకోవాలి.


ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..


అవకాడో మాస్క్‌..
అవకాడో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి బాగా అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరగడమే కాదు మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది కూడా.


బనానా మాస్క్‌..
ఒక పండిన బనానా తీసుకొని వాటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బనానా మిక్స్ అని బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని జుట్టు అంతటికి పట్టించి బాగా కాసేపు మసాజ్ ఓ పదిహేను నిమిషాల తర్వాత చల్లనీళ్లతో స్నానం చేస్తే సరిపోతుంది. కండిషనర్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


తేనె..
ఆలివ్ ఆయిల్ లో తేనె వేసుకొని జుట్టు అంతటికి బాగా పట్టించి ఆరనివ్వాలి. ఓ 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. మీ హెయిర్ కేర్ రొటీన్ లో ప్రతిసారి తల స్నానం చేయడం వల్ల అవలంబించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది ఏ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి