Camphor Skincare: కర్పూరం అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. కర్పూరాన్ని పూజాలో వాడతాం. అయితే, సాధారణంగా కర్పూరాన్ని హెయిర్ ప్రాబ్లెమ్ సమస్యలకు ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో మీముఖం 10 నిమిషాల్లో కాంతివంతంగా మారుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్పూరం మన బామ్మల కాలంనాటి నుంచి కొబ్బరినూనెలో కూడా ఉపయోగించడం చూశాం. దీంతో డ్యాండ్రఫ్ కు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు కర్పూరంలో బ్యాక్టిరియా, ఫంగల్ ఇన్పెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. కర్పూరంతో మీ ముఖం కాంతివంతంగా మారి మచ్చలేకుండా చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.


కర్పూరం, బాదం నూనె..


ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, చిటికెడు కర్పూరం పొడిని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించకండి. జిడ్డు తగ్గిపోతుంది ఫేస్ గ్లో పెరుగుతుంది.


కర్పూరం, శనగ పిండి..


ముఖంపై మచ్చలు తొలగించడానికి కర్పూరంతో శనగపిండిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనిని చిటికెడు కర్పూరంలో ఒక టీస్పూన్ శనగపిండి ,రోజ్ వాటర్‌ను అవసరమైనంత జోడించి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను 15 రోజులకు ఒకసారి వాడండి  మీ చర్మంలో తేడా కనిపిస్తుంది. మీ ముఖం చంద్రబింబంలా మెరుస్తుంది.


ముల్తానీ మట్టి, కర్పూరం..


ఒక గిన్నెలో రోజ్ వాటర్‌తో రెండు చెంచాల ముల్తానీ మట్టి, చిటికెడు కర్పూరం పొడి కలపండి. ఈ పేస్ట్‌ని ముఖం ,మెడపై అప్లై చేసి పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది.


ఇదీ చదవండి:  Coconut Water: కొబ్బరి నీరు సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది..! ఎలా అప్లై చేసుకోవాలంటే..?


ఇదీ చదవండి:  Do Not Keep In Fridge: ఫ్రిజ్‌లో ఈ 5 ఆహారపదార్థాలు ఎప్పుడూ పెట్టకూడదు.. విషంగా మారతాయి జాగ్రత్త..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter