Coconut Water: కొబ్బరి నీరు సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది..! ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Coconut Water: కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మచ్చలు ఇతర చర్మపు మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.ఇందులో విటమిన్లు, మినరల్స్ ,ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు అన్ని రోగాలకు మంచి ఔషధం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 2, 2024, 10:33 AM IST
Coconut Water: కొబ్బరి నీరు సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది..! ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Coconut Water: ఎండలో వెళ్లినా సాధారణంగా అయినా మన ముఖానికి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు. ఇలా చేయడం వల్ల చర్మం యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, సన్ స్క్రీన్ ధర కూడా మార్కెట్లో ఎక్కువగానే ఉంటుంది. మీకు తెలుసా? కొబ్బరినీళ్లు కూడా నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. సాధారణంగా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ,ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు అన్ని రోగాలకు మంచి ఔషధం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అనేక రకాల ఆహారాలలో శరీరానికి అవసరమైన పోషకాలు ,ఖనిజాలు ఉంటాయి.  

కొబ్బరినీరు ముఖ అందాన్ని కూడా పెంచుతుంది. జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు ముఖానికి తగిన తేమను అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మచ్చలు ఇతర చర్మపు మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే చర్మం మరింత కాంతివంతంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలోని ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నీరు చర్మాన్ని అద్భుతంగా కాపాడుతుంది. ఇది ముఖానికి అప్లై చేయడం వల్ల ఔషదంలా పనిచేస్తుంది.

కొబ్బరి నీరు సన్ స్క్రీన్‌గా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. వడదెబ్బను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్  ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమల నుండి ముఖాన్ని కాపాడుతుంది. కొబ్బరి నీరు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే పనిని కూడా నెరవేరుస్తుంది. 

కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. ఇది 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా రోజూ చేస్తే 3-4 వారాల్లో ఫలితం కనిపిస్తుంది. మీ ముఖానికి కొబ్బరి నీళ్లను అప్లై చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చేతులను ఉపయోగించి నేరుగా ముఖంపై అప్లై చేయవచ్చు. లేదా ఏదైనా ఇతర పదార్ధంతో కలిపి అప్లై చేయవచ్చు. ఇది నేచురల్ సన్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు.

ఇదీ చదవండి:  Do Not Keep In Fridge: ఫ్రిజ్‌లో ఈ 5 ఆహారపదార్థాలు ఎప్పుడూ పెట్టకూడదు.. విషంగా మారతాయి జాగ్రత్త..!  

ఇదీ చదవండి:  TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News