Turmeric Face mask: పసుపుతో తయారు చేసే ఈ మాస్క్ ముఖానికి మచ్చలు లేకుండా గోల్డెన్ గ్లో ఇస్తుంది..
Turmeric Face mask: ఈ హోం రెమిడీలతో మీ ముఖం పార్లర్‌కు వెళ్లక ముందే కాంతివంతంగా మెరుస్తుంది. మీ ముఖంపై మచ్చలు, గీతలు లేకుండా మెరుస్తుంది. అయితే, ఏ ఫేస్ మాస్క్ వేసుకున్నా కానీ, ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేసుకోవాలి.
Turmeric Face mask: పసుపు నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉండే కిచెన్ వస్తువు. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్యపరంగా కూడా పసుపుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. దీంతో చర్మానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పసుపుతో మీరు ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖానికి గోల్డెన్ గ్లో ఇంట్లోనే పొందుతారు.
పసుపు, తేనె మాస్క్..
తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. పసుపుతో తేనె కలిపి మాస్క్ తయారు చేసుకుని మాస్క్ వేసుకోవడం వల్ల గ్లో వస్తుంది. ఈ మాస్క్‌ను ముఖం కడిగి అప్లై చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. తేనెలో సహజసిద్ధంగ మెరుపు ఇచ్చే గుణం ఉంటుంది.
పసుపు పెరుగు..
పెరుగులో కూడా మాయిశ్చర్ గుణాలు ఉంటాయి. పసుపు, పెరుగు కలిపి ముఖానికి మాస్క్ వేయడం వల్ల ముఖానికి మచ్చలేకుండా గ్లో వస్తుంది. ఈ మాస్క్‌ను ఓ 20 నిమిషాల పాటు వేసుకుని స్క్రబ్ చేస్తూ ముఖాన్ని కడగాలి.
ఇదీ చదవండి: ప్రతిరోజు 2 పిస్తాలు తింటే డాక్టర్‌తో పనే ఉండదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
శనగపిండి, పసుపు..
శనగపిండి ముఖంపై ఉండే అదనపు నూనెను గ్రహిస్తుంది. ముఖ్యంగా ఇది యాక్నే, మచ్చలు, గీతలు లేకుండా ముఖాన్ని మెరిపిస్తుంది. ఒక స్పూన్ శనగపిండి, అరటీస్పూన్ పసుపు వేసి కలిపి ఫేస్ మాస్క్ తయారు చేయాలి. ఇందులో రోజ్ వాటర్ కూడా వేసి కలిపి ఓ 20 నిమిషాల పాటు ముఖానికి అప్లై చేసుకోవాలి.
బియ్యం పిండి, పసుపు..
బియ్యం పిండిలో చర్మానికి రంగు నిచ్చే గుణం ఉంటుంది. ఒక స్పూన్ బియ్యం పిండిలో ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల రోజ్ వాటర్ లేదా పచ్చి పాలు కూడా వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ ముఖాన్ని వాష్ చేయాలి. బియ్యం పిండిలో కూడా ముఖానికి తక్షణ గ్లో ఇచ్చే గుణాలు ఉంటాయి.
ఇదీ చదవండి: Healthy Rice: ఈ రైస్ తింటే ఎంతో బలం.. టేస్టీగా కూడా ఉంటుంది..
ఈ హోం రెమిడీలతో మీ ముఖం పార్లర్‌కు వెళ్లక ముందే కాంతివంతంగా మెరుస్తుంది. మీ ముఖంపై మచ్చలు, గీతలు లేకుండా మెరుస్తుంది. అయితే, ఏ ఫేస్ మాస్క్ వేసుకున్నా కానీ, ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేసుకోవాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి