Pista Health Benefits: ప్రతిరోజు 2 పిస్తాలు తింటే డాక్టర్‌తో పనే ఉండదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Pista Health Benefits: ఈ చిన్న, పచ్చని గింజల్లో ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు రెండు పిస్తాలు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 23, 2024, 03:08 PM IST
Pista Health Benefits: ప్రతిరోజు 2 పిస్తాలు తింటే డాక్టర్‌తో పనే ఉండదు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

Pista Health Benefits: ఈ చిన్న, పచ్చని గింజల్లో ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు రెండు పిస్తాలు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది సమతుల్య ఆహారంలో చేర్చుకోవాలి. అయితే రోజు రెండు పిస్తాలు తీసుకోవడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఖనిజాలు పుష్కలం..
ఒక పిస్తా గింజలో నాలుగు క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు ఇందులో ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ముఖ్యంగా ఇందులో విటమిన్ b6 ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. పిస్తా లో విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది.

గుండే ఆరోగ్యం..
పిస్తాలు డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఫైటోన్యూట్రియేంట్స్‌ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది.

బరువు నిర్వహణ..
పిస్తా డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహిస్తారు. ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. కానీ నివేదికల ప్రకారం పిస్తాలు ఈవినింగ్ స్నాక్ లో తీసుకోవడం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ కూడా నిర్వహిస్తుంది.

ఇదీ చదవండి: బియ్యం పిండి ఇలా వాడితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

షుగర్ లెవెల్స్..
పిస్తా లో గ్లైసమిక్స్ సూచి కూడా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు షుగర్ ఆ హఠాత్తుగా పెరగడం ఇవ్వదు. ఈవినింగ్ స్నాక్ లో తీసుకోవడం వల్ల డయాబెటిస్ నిర్వహిస్తుంది. అంతేకాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ స్థాయికి చేరుకుంటాయి.

కడుపు ఆరోగ్యం..
ఫైబర్ పుష్కలంగా ఉండే పిస్తాలు డైట్లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. జీర్ణ సమస్యలు దరిచేరవు నివేదికల ప్రకారం కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది బాదం కంటే మేలు చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్..
పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రెస్ నివారిస్తాయి. ముఖ్యంగా ఇందులో లుటీన్, జియాన్తిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

ఇదీ చదవండి: స్ప్రౌట్స్‌ ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో తిన్నారంటే ఈజీగా వెయిట్‌ లాస్‌ అవుతారు.. 

ఆరోగ్యకరమైన రక్తనాళం..
పిస్తాలు డైట్ లో ఉండటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త నాళాల్లో రక్తప్రసరణ మెరుగు చేస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News