Valentine Week 7th To 14th Febraury: ఫిబ్రవరి 14 వస్తుంది అంటే ప్రేమికులందరూ తమ ప్రియమైన వారికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే ఎక్కడ? ఎలా మొదలైంది? అనే విషయాన్ని పక్కన పెడితే వాస్తవానికి వాలెంటైన్స్ డే వారం ముందు నుంచే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 7 తారీఖు మొదలు 14వ తేదీ వరకు వాలెంటైన్స్ వీక్ గా జరుపుకుంటూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 7వ తారీఖున రోజ్ డే అనే వేడుక జరుపుకుంటూ ఉంటారు. అంటే ఆరోజున గులాబీ పువ్వులను తన ఇష్టమైన వారికి ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే గా జరుపుకుంటూ ఉంటారు అంటే తమకు ఇష్టమైన వారికి ఆరోజు ప్రేమను వ్యక్తం చేస్తారన్నమాట. ఇక ఫిబ్రవరి 9వ తేదీన చాక్లెట్ డే జరుపుకుంటారు ఆరోజు ఇష్టమైన వారికి చాక్లెట్ ఇస్తూ తమ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు.


అలాగే ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డి డే జరుపుకుంటారంటే ఎక్కువగా ఆడపిల్లలు ఇష్టపడే టెడ్డీబేర్ లను వారి ప్రియులు వారికి అందజేస్తూ ఉంటారు. ఇక ఫిబ్రవరి 11వ తేదీన ప్రామిస్ డే జరుపుకుంటారు ఆరోజు జీవితాంతం నీతోనే నడుస్తానని ఒకరికి ఒకరు ప్రామిస్ చేసుకుంటారు. ఫిబ్రవరి 12వ తేదీ విషయానికి వస్తే ఆ రోజు హగ్ డే పేరుకు హగ్ డే అయినా సరే ఇండియాలో అంతా అడ్వాన్స్ అవలేదు కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఆ రోజు ప్రేమికులు హగ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు.


ఇండియాలోనూ అక్కడి వరకు వెళ్లినవారు ఉన్నారనుకోండి అది వేరే విషయం. ఇక ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే, ఆ రోజు ముద్దుల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అదే ఫిబ్రవరి 14వ తేదీ విషయానికి వస్తే వాలెంటైన్స్ డే ఆ రోజు తమ ప్రియమైన వారితో గడిపేందుకు ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు. వారు ఒకవేళ వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నట్లయితే వారిని కలవడం కోసం సుదీర్ఘ ప్రయాణాలు సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మాత్రం బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే బజరంగ్ దళ్ లాంటి సంస్థలు పెళ్లిళ్లు చేసేయడం ఖాయమే కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకుంటే మంచిది మరి.


Also Read: Valentines Day 2023: వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది.. లవ్లీ కపుల్స్ కోసం లవ్లీ టూరిస్ట్ స్పాట్స్


Also Read: Free Condoms On Valentine's Day: వాలెంటైన్స్ డే రోజున ఫ్రీ కండోమ్స్.. ఎందుకో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.