Happy Valentines Day Special Gifts: వాలెంటైన్స్ డే అనేది ప్రేమికులిద్దరి మధ్య ఉన్న ప్రేమను మరింత బలంగా చేసుకునే సరైన రోజుగా భావించవచ్చు. మీరు ప్రాణంగా ప్రేమించే వారి పట్ల ప్రేమను, శ్రద్ధను చూపించే రోజుగా కూడా చెప్పొచ్చు.  అంతేకాకుండా కొందరిలో ప్రేమ చిగురించే రోజు కూడా.. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.  కొన్ని దేశాల్లో ఈ రోజు ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటిస్తారు. అయితే వెస్టెన్‌ కంట్రీస్‌లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఒకరికొకరు వారికి  ఇష్టమైన స్నేహుతురాలికి బహుమతులుస్తూ ఆనందంతో రోజు మొత్తం గడుపుతారు. అయితే మీరు కూడా మీ లవర్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే వీటిని ఇవ్వండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాలెంటైన్స్ డే మీరు తప్పకుండా ఇవ్వాల్సిన గిఫ్ట్స్‌:
చాక్లెట్లు, స్వీట్లు:

తిపి గుర్తులు చిర కాలం గుర్తుంచుకోవడానికి మీరు చాక్లెట్లు, స్వీట్లను గిఫ్ట్స్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని బహుమతులుగా ఇవ్వడం వల్ల తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.


రోజా పూలు:
రెడ్‌ రోస్‌ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ రోజూ రోస్‌లను బహుమతులుగా ఇవ్వడం వల్ల జీవితాంతం ఆ పూలు ప్రేమ గుర్తులుగా ఉండిపోతాయి.


గోల్డ్‌ రింగ్స్‌:
ఈ రోజు ప్రేమికులు కపుల్‌ రింగ్స్‌ మార్చుకుంటూ ఉంటారు. ఇది ప్రేమ, ఆప్యాయతకు శాశ్వత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజూ చాలా మంది ప్లాటీనం రింగ్స్‌ కూడా గిఫ్ట్స్‌గా ఇస్తారు.


లాంగ్‌ ట్రీప్స్‌:
విహారయాత్రలు అనేవి చాలా సాధరణమైనవి. అయితే ఈ రోజూ ప్రేమికులు కలిసి లాంగ్‌ ట్రీప్స్‌ వెల్లడం కూడా ఇద్దరికీ బహుమతి లాంటిదే.. ప్రేమికులు తమ ప్రేమను రెట్టింపు చేసుకునేందుకు ఈ లాంగ్‌ ట్రీప్స్‌ సహాయపడుతుంది.


కస్టమైజుడ్‌  గిఫ్ట్స్‌:
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల కస్టమైజుడ్‌  గిఫ్ట్స్‌ లభిస్తున్నాయి. అయితే మీకు నచ్చి ఫోటో ఆల్బమ్‌లు, ప్రేమ లేఖలను కూడా ఈ రోజు  గిఫ్ట్స్‌గా ఇవ్వొచ్చు. వాటిని చూసినప్పుడు మీకు బహుమలు ఇచ్చివారు గుర్తుకొస్తారు.


 మీ చేతి రుచిలు భోజనం:
ఈ రోజు మీరు ఇష్టపడుతున్నవారికి మీరు తయారు చేసిన భోజనాన్ని అందించడం వల్ల ఆనందంగా ఫీల్‌ అవుతారు. ఈ భోజనంలో తప్పకుండా స్వీట్‌ను వడ్డించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి భోజనాలను గిఫ్ట్స్‌గా కోరుకుంటున్నారు.


రొమాంటిక్ డిన్నర్:
ఫ్యాన్సీ రెస్టారెంట్స్‌ అందుబాటులోకి వచ్చాకా.. రొమాంటిక్ డిన్నర్ ప్రత్యేకత కూడా పెరిగిపోయింది. అయితే ఈ రొమాంటిక్ డిన్నర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఓ డార్ట్‌ రూములో కొవ్వొత్తులు వెలిగించి ఓల్డ్‌  వైన్‌తో పాటు కలిసి డిన్నర్‌ చేయడం. 


Also Read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు


Also Read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook