Vankaya Bajji: ఆంధ్ర స్టైల్ వంకాయ బజ్జీ రెసిపీ.. రుచికి ఫిదా అవుతారు!
Vankaya Bajji Recipe: వంకాయ బజ్జీలు అంటే అందరూ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మీరు కూడా వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా? ఈ రెసిపీ మీ కోసమే..
Vankaya Bajji Recipe: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా సాయంత్ర పూట స్నాక్స్ తింటారు. ఇందులో భాగంగానే కొంతమంది పిండి వంటలు తింటే, మరికొంతమంది ఎక్కువగా బజ్జీలు తింటూ ఉంటారు. తెలుగు ప్రజలు వివిధ రకాల కూరగాలతో బజ్జీలను తయారు చేసుకుంటారు. అందులో అందరూ ఎక్కువగా తయారు చేసుకునే బజ్జీల్లో టమోటో, వంకాయ, ఎగ్ బజ్జీలు కీలకం.. ముఖ్యంగా చాలా మంది వీటిలో వంకాయతో తయారు చేసిన బజ్జీలు తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. వంకాయలతో తయారు చేసిన బజ్జీలు తినడం వల్ల శరీరానికి కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసం సులభమైన పద్ధతిలో ఎలా సులభంగా వంకాయ బజ్జీలను తయారు చేసుకోవాలో తెలియబోతున్నాం.
వంకాయ బజ్జీల తయారు విధానం, కావాల్సిన పదార్థాలు:
వంకాయలు: 2-3 (పొడవుగా కోసి, ఉప్పు, పసుపు వేసి కొంతసేపు నీటిలో ఉంచాలి)
శనగ పిండి: 1 కప్పు
ఉల్లిపాయ: 1 (చిన్న చిన్న ముక్కలుగా కోసి)
జీలకర్ర: 1/4 టీస్పూన్
నీరు: అవసరమైనంత
నూనె: వేయించుకోవడానికి
కారం పొడి: 1/2 టీస్పూన్
కుంకుమపు పులుసు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట (చిన్న చిన్న ముక్కలుగా కోసి)
ఆవాలు: 1/2 టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా ఈ బజ్జీలను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో శనగ పిండి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, కారం పొడి, కుంకుమపు పులుసు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి అందులో వంకాయను పిండి మిశ్రమంలో వేసి నూనెలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసి బజ్జీని రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా బాగా వేగిన బజ్జీలను పేపర్ టవల్స్ పరిచి బౌల్‌లో వేసుకుని అదనపు నూనె పీల్చుకునేవారకు ఉంచాల్సి ఉంటుంది. అయితే వీటిని పుదీనా చట్నీతో కలిపి తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ బజ్జీల రుచిని పెంచుకోవడానికి పిండిని మిక్స్ చేసుకునే క్రమంలో కాస్తంత జీలకర్రను కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు సైజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
పిండి కలుపుకునే క్రమంలో మిశ్రమం మరీ పలుచగా లేకుండా.. గట్టిగా లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వంకాయలను నిలువులో చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది.
బజ్జీలను తక్కువ మంటపై వేయించడం వల్ల మంచి రుచిని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.