Vegetables Storage Tips: ఆ 4 కూరగాయల్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదా, ఉంచితే ఏమౌతుంది
Vegetables Storage Tips: వేసవి వచ్చేసింది. పండ్లు, కూరగాయలు, పాలు ఇలా అన్నీ ఫ్రిజ్‌లో వెళ్లిపోవల్సిందే. లేకపోతే వేడి కారణంగా పాడైపోతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకూడదని మీకు తెలుసా..
చల్లటి ప్రదేశాల్లో సాధారణంగా ఏ పదార్ధాలు పాడవకుండా ఉండాయి. అందుకే ఫ్రిజ్‌ల వాడకం పెరిగిపోయింది. దాదాపు ఇంట్లోని అన్ని వస్తువుల్ని ఫ్రిజ్‌లో ఉంచడం అలవాటుగా మారిపోయింది. అయితే కొన్ని వస్తువులు లేదా పదార్ధాల్ని మాత్రం ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఫ్రిజ్ ఉంది కదా అని అన్ని పదార్ధాను అందులూ ఉంచకూడదు. కొన్ని పదార్ధాలను సాధారణ ఉష్ణోగ్రతలో బయటే ఉంచాలి. అలాకాకుండా ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, రంగు ఇతర విషయాల్లో తేడా వస్తుంది. ముఖ్యంగా 4 రకాల కూరగాయల్ని ఫ్రిజ్ నుంచి దూరంగా ఉంచాలి.
ఉల్లిపాయలు
ఉల్లిపాయల్ని ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో బయటే ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కుళ్లిపోతాయి. వీటిని ఎప్పుడూ గాలి ధారాళంగా వీచే ప్రదేశంలో ఉంచాలి. ఉల్లిపాయల్ని ఎప్పుడూ డ్రైగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో ఉంటడం వల్ల ఫంగస్ ఏర్పడవచ్చు. అదే జరిగితే తినడానికి పనిచేయవు.
అరటి పండ్లు
అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడని పదార్ధం. వీటిని ఎప్పుడూ ఫ్రెష్ గాలి, డ్రై ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల చల్లని వాతావరణం కారణంగా అరటి పండ్లు నల్లబడిపోతాయి. ఫంగస్ ఏర్పడవచ్చు. రుచి మారిపోతుంది.
బంగాళ దుంపలు
బంగాళదుంపల్ని ఎప్పుడూ డ్రై ప్రదేశంలోనే ఉంచాలి. పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇందులో పౌష్ఖిక గుణాలు, రంగు, రూపం యధావిధిగా ఉండాలంటే..ఫ్రెష్, డ్రైగా ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉండటం వల్ల బంగాళ దుంప రంగు రూపం మారిపోవచ్చు.
టొమాటో
చాలామంది టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. టొమాటోలను ఎప్పుడూ బయటి వాతావరణంలో ఉంచడం మంచిది. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి ఆకృతి, రుచిలో తేడా వస్తుంది.
Also read: Green Chilli: మిరపకాయలను అతిగా తింటే అంతే సంగతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook