Vitamin For Hair Growth: మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం విశేషం. దీని కారణంగా హార్మోన్ల మార్పుల వచ్చి  జుట్టు రాలిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాల్లో ఖనిజాలు, విటమిన్లు అతిగా ఉండే పదార్థాలను తీసుకుంటే.. జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి:


ఐరన్‌ ఫుడ్‌:
ఐరన్‌ ఫుడ్‌ ఎర్ర రక్త కణాలను రీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో దీని లోపం ఉంటే.. రక్తహీనతకు దారితీస్తుంది. దీని కారణంగా  విపరీతమైన అలసట, చర్మం పసుపు రంగులోకి మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


కావున వీటిని ఆహారంగా తీసుకోండి:


>>ఆకు కూరలు
>>మాంసం
>>పాలకూర
>>దానిమ్మ
>>బీట్‌రూట్
>>చిక్కుళ్ళు


 బయోటిన్:
శరీరానికి  బయోటిన్ చాలా ముఖ్యమైనది. బయోటిన్‌ని విటమిన్ B7గా పిలుస్తారు.  బయోటిన్ లోపం జుట్టు రాలడానికి, గోర్లును బలహీనంగా మారుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల శరీరంలో బయోటిన్ లోపం ఉండవచ్చు.


శరీరంలో బయోటిన్ లోపం ఉంటే వీటిని ఆహారంగా తీసుకోవాలి:


బయోటిన్ కోసం ఏమి తినాలి:
>>తృణధాన్యాలు
 >>మాంసం
>> గుడ్డు పచ్చసొన


విటమిన్ సి:
విటమిన్ సి శరీరానికి చాలా అవసరం.. ముఖ్యంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఈ విటమిన్‌ లోపమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలో అధిక పరిమాణంలో ఉంటేనే.. జుట్టు దృఢంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.


వీటిని తీసుకుంటే ఈ విటమిన్ లోపం ఉండదు:
>>ఆకు కూరలు
>>ఆమ్ల ఫలాలు
>>క్యాప్సికమ్
>>ఉసిరి కాయలు


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook