Walking Rules: ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విధానం. కొందరు వాకింగ్ చేస్తే మరి కొందరు ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. ఇంకొందరు యోగా చేస్తుంటారు. వాకింగ్ సందర్భంగా కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఫిట్నెస్ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. అందుకే చాలామంది వ్యాయామం, యోగా, వాకింగ్, సైక్లింగ్ ఇలా విభిన్న రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువమంది వాకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. మీక్కూడా వాకింగ్ చేసే అలవాటుంటే..కొన్ని సూచనలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. లేకపోతే..ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. వాకింగ్‌‌కు సంబంధించిన సూచనలేంటో తెలుసుకుందాం..


మార్నింగ్ వాక్ నిబంధనలు, సూచనలు


వాకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన విషయం ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం. వాకింగ్ ప్రారంభించేముందు పాజిటివ్ మాటలు, ఆలోచనలు గుర్తు తెచ్చుకోవాలి. మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్స్ వాడకూడదు. వాకింగ్ చేసే స్పీడ్ ఎప్పుడూ ఒకేలా ఉండాలి. నడిచే సమయంలో ఇతర ఏ విధమైన ఆలోచనలు చేయకూడదు.


ఫిట్నెస్ కోసం వాకింగ్ చేసేవాళ్లు రోజుకు కనీసం 45 నిమిషాలు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. ఈ 45 నిమిషాల వాకింగ్ ఒకేసారి కాకుండా 2-3 సార్లు ఉండాలి. అంటే మధ్యలో కాస్త విశ్రాంతి అవసరం. అదే సమయంలో మీ సామర్ధ్యం, టైమ్‌ను బట్టి ఎంతసేపు చేయాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తరువాత నిర్ణీత సమయంలో వాకింగ్ చేయాలి. కొన్నిరోజుల్లోనే ఫలితాల్ని చూస్తారు. 


వాకింగ్‌లో చేయకూడని తప్పులు


వాకింగ్ ఎప్పుడూ చెప్పులతో లేదా చెప్పుల్లేకుండా చేయకూడదు. క్వాలిటీ స్పోర్ట్స్ షూస్ ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. చెప్పులతో వాకింగ్ చేయడం వల్ల  కాలి మడమ దెబ్బతినవచ్చు. పాదాలు నొప్పిగా ఉంటాయి. అదే స్పోర్ట్స్ షూస్‌తో వాకింగ్ చేయడం వల్ల హాయిగా ఉంటుంది. 


వాకింగ్ చేసేటప్పుడు కాళ్లతో పాటు చేతుల్ని కూడా కదిలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం మొత్తం బ్యాలెన్స్‌గా ఉంటుంది. దాంతోపాటు శరీరం సామర్ధ్యం పెరుగుతుంది. పొరపాటున కూడా చేతులు మడిచి వాకింగ్ అనేది చేయకూడదు. ఇలా చేయడం వల్ల భుజాలు, జాయింట్స్‌లో నొప్పులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


మార్నింగ్ వాక్ చేసేటప్పుడు మీ వీపును నిటారుగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ లేదా వీపు నొప్పి సమస్య ఉండదు. నడుము నిటారుగా ఉండటం వల్ల వెన్నుపూస పటిష్టమౌతుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ కావల్సినంత లభిస్తుంది. తప్పుడు పోశ్చర్‌లో వాకింగ్ చేయడం వల్ల అనారోగ్యం పాలవుతారు. 


Also read: Blood Pressure: ప్రాణాంతకమైన అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook