Weight Loss Brown Rice Roti In Telugu: చాలామంది కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే క్రమంలో వివిధ రకాలు డైట్లను అనుసరిస్తారు. ఇందులో చాలావరకు ఎక్కువగా చపాతీలను తీసుకుంటారు. చపాతీల్లో కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది.. కాబట్టి బరువు తగ్గే క్రమంలో.. కొలెస్ట్రాల్ నియంత్రణలో భాగంగా వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నిజానికి చాలామంది గోధుమపిండితో తయారు చేసిన రోటీలను ఎక్కువగా తీసుకుంటారు. వీటికి బదులుగా బ్రౌన్ రైస్ తో తయారు చేసిన చపాతీలు తినడం వల్ల ఎంతో సులభంగా కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ పిండితో తయారు చేసిన చపాతీలను తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గడమే కాకుండా సులభంగా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. అయితే ఈ బ్రౌన్ రైస్ చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావలసిన పదార్థాలు:
బ్రౌన్ రైస్ పిండి - 2 కప్పులు
నీరు - అవసరమైనంత
ఉప్పు - రుచికి సరిపోయేంత
నూనె - వేయడానికి


తయారీ విధానం:
పిండి కలిపడం: ఒక పాత్రలో బ్రౌన్ రైస్ పిండిని తీసుకొని, దానిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.. తర్వాత, కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మృదువైన పిండిగా బాగా పిసుకుని ముద్దలాగా తయారు చేయాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.


పిండిని విశ్రాంతి తీసుకోనివ్వడం: ఇలా బాగా కలిపిన పిండిని దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. 


చపాతీలు రోల్ చేయడం: 25 నిమిషాల తర్వాత పిండి బాగా మెత్తబ డుతుంది. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ప్రతి ఉండను చపాతీ రూపంలో రోల్ చేసి, రెండు వైపులా నూనె రాసి వేడి తవాపై వేయండి.


వేయడం: మంటను మధ్యస్థంగా ఉంచి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.


సర్వ్ చేయడం: వేడి వేడి బ్రౌన్ రైస్ పిండి చపాతీలను మీకు ఇష్టమైన కూర లేదా రాయతతో సర్వ్ చేసుకొని తింటే బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
బ్రౌన్ రైస్ పిండి కొంచెం గట్టిగా ఉండేలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 
చపాతీలను వేయడానికి తవాను బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చపాతీలు బాగా వస్తాయి..
మంటను మధ్యస్థంగా ఉంచి, నెమ్మదిగా వేయాలి. బ్రౌన్ రైస్ పిండి చపాతీలను వేయడానికి మైక్రోవేవ్‌లో కూడా ఉంటుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.