Weight Loss Diet: ఉదయం పూట వీటిని అల్పాహారంగా చేర్చుకుంటే.. శరీర బరువుతో పాటు, అనారోగ్య సమస్యలు తప్పవు..
Weight Gaining Unhealthy Breakfasts: ప్రస్తుతం చాలా మంది అల్పాహారంలో వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారలు తీసుకుంటున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండకుండా పలు రకాల ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight Gaining Unhealthy Breakfasts: ప్రతి రోజూ అల్పాహారం తీసుకోవడం దినచర్యలో భాగంగా మారింది. అయితే ప్రతి రోజూ దీనిని తీసుకోవడం మానుకుంటే శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది టిఫిన్ తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళా తప్పుడు ఆహారాలు తీసుకున్న అది అధిక బరువుకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటి కోసం పలు రకాల ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారాలను అస్సలు తీసుకొవద్దు:
వైట్ బ్రెడ్:
ప్రస్తుతం చాలా మంది వైట్ బ్రెడ్ అల్పాహారంలో తీసుకుంటున్నారు. అయితే వీటికి బదులుగా పలు పోషకాలు కలిగిన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బ్రెడ్ జామ్ ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అల్పాహారంలో బ్రెడ్ తినడం మానుకోండి.
ఫాస్ట్ ఫుడ్:
చిన్న పిల్లల నుంచి పెద్దవారు దాకా ఫాస్ట్ ఫుడ్స్‌ను విచ్చల విడిగా తింటున్నారు. అయితే ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ అల్పాహారంలో తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
కాఫీ:
ఖాళీ కడుపుతో ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువును పెంచి చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని ఇటీవలే పలువురు నిపుణులు తెలుపుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారం:
ప్రాసెస్ చేసిన ఆహారం ప్రతి రోజూ తినడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే రసాయనాలు చాలా రకాల హానికరమైన వ్యాధులకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని తినకపోవడం చాలా మంచిది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Veera Simha Reddy Collection : కలెక్షన్లలో నిజమెంత ఉంది.. వీరయ్య, వీర వసూళ్ల పోస్టర్ల మీద చర్చలు
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook