Weight Loss drinks: ఈ డ్రింక్స్‌తో శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ మటు మాయం.. ఇలా ప్రతి రోజూ తాగితే చాలు..
Weight Loss drinks: బరువు తగ్గాలనుకునేవారు చలి కాలంలో నిమ్మ రసానికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ నీటిని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Weight Loss drinks: శరీర బరువు తగ్గడానికి చాలా మంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారు. అయితే ఇలా చలి కాలంలో నిమ్మరసం తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో జలుబు, దగ్గు, అలసట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చలి కాలంలో బరువు తగ్గడానికి తీసుకునే మార్నింగ్ డ్రింక్‌లో పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చలి కాలంలో నిమ్మ రసానికి బదులుగా పలు రకాల డ్రింక్స్ కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు బరువు కూడా సులభంగా తగ్గుతారు.
చలికాలంలో బరువు తగ్గాలంటే లెమన్ వాటర్ కి బదులు ఈ డ్రింక్స్ తాగండి:
సెలెరీ వాటర్:
చాలా మంది సెలెరీ గురించి తెలియదు. ఇది ఒక ఆకు కూర లాంటిది. ఇందులో శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరం రక్షిస్తుంది. అయితే సెలెరీతో చేసి జ్యూస్‌ను ప్రతి రోజూ నిమ్మరసానికి బదులుగా తీసుకుంటే సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గుతాయి.
జీలకర్ర నీరు:
శీతాకాలంలో సులభంగా బరువు తగ్గడానికి జీలకర్ర నీరు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. కాబట్టి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని ప్రతి రోజూ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మెంతి నీరు:
మెంతి గింజలతో తయారు చేసిన నీరు కూడా శరీరానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడానికి సహాయపడడమేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి శీతాకాలం కారణంగా జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ డ్రింక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
తేనె:
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల తగ్గించి బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ డ్రింక్ తాగాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook