Fit and Slim Tips: ఫిట్ అండ్ స్లిమ్‌గా ఫ్లాట్ స్టమక్ లేదా బెల్లీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు కొన్ని రకాల పండ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా 6 రకాల ఫ్రూట్స్ డైట్‌లో చేరిస్తే మీరు ఊహించినట్టే మారవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టొమాటో సాధారణంగా వంటల్లో రుచి పెంచేందుకు వినియోగిస్తుంటారు. కానీ బరువు నియంత్రణలో, ఆరోగ్యపరంగా టొమాటోతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఫైబర్ బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించి ఫిట్ అండ్ స్లిమ్‌గా మారేందుకు టొమాటోలోని లైకోపీన్ ఉపయోగపడుతుంది. టొమాటోను ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల అరటి పండ్లు బరువు నియంత్రణలో దోహదం చేస్తాయి. ఇందులో పెద్దమొత్తంలో ఉండే సాల్యుబుల్ పైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇందులోని స్టార్చ్ అనే పదార్ధం జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. 


ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. నిజంగా ఆపిల్ ఆరోగ్యపరంగా అంత అద్భుతమైంది. బెల్లీ ఫ్యాట్‌ను ఇట్టే దూరం చేస్తుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. పోలీఫెనోల్స్ మెటబోలిజం వృద్ధి చేస్తాయి. శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. 


నిమ్మకాయల్ని బెస్ట్ డీటాక్స్ ఏజెంట్స్‌గా పిలుస్తారు. అందుకే బరువు నియంత్రణలో పెద్దఎత్తున ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరంలో సహజసిద్ధంగా డీటాక్స్ ప్రక్రియ జరుగుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కొద్దిగా పిండుకుని ఉదయం పరగడుపున తాగితే చాలు.


ఆరెంజ్ కూడా బరువు తగ్గించుకునేందుకు అద్బుతంగా పనిచేస్తాయి. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. ఇందులోని విటమిన్ సి కారణంగా అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. కొవ్వును కరిగించి నడుము సరిగ్గా ఉండేట్టు చేస్తుంది. అందుకే రెగ్యులర్ డైట్‌లో ఆరెంజ్ తప్పకుండా చేర్చాలి.


ఇక వాటర్ మెలన్, మస్క్ మెలన్ వంటివి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. శరీరంలో చేరే అదనపు కొవ్వును కరిగించి ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. 


Also read: Diabetes Tips: మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచే 6 అద్భుతమైన టిప్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook