Weight Loss Oats Upma: బరువు తగ్గించే ఓట్స్ ఉప్మా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు..
Weight Loss Oats Upma: ఓట్స్ ఉప్మా క్రమం తప్పకుండా అల్పాహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలేరు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Weight Loss Oats Upma: ఓట్స్ లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహం, బరువు తగ్గడం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ లో ఉండే కొన్ని మూలకాలు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడమే కాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు కడుపు నిండేలా చేసి జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఓట్స్ ను ఆహారంగా చేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఓట్స్ను మిల్క్ తో కలిపి తీసుకుంటూ ఉంటారు. నిజానికి వీటిని ఉప్మా లాగా తయారు చేసుకుని తింటే మరెన్నో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ తో ఉప్మా తయారు చేసుకొని తినడం చాలా మంచిది. అయితే మీరు కూడా సులభంగా ఇంట్లోనే ఓట్స్ ఉప్మాను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా సులభమైన పద్ధతిలో ఇప్పుడే తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
2 కప్పుల నీరు
1/2 టేబుల్ స్పూన్ నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
1/4 కప్పు తరిగిన ఉల్లిపాయ
1/4 కప్పు తరిగిన టమాట
1/2 కప్పు తరిగిన కూరగాయలు (క్యారెట్, బీన్స్, మొలకలు, మీకు ఇష్టమైనవి)
1/4 కప్పు తరిగిన కొత్తిమీర
ఉప్పు రుచికి సరిపడా
నిమ్మరసం
తయారీ విధానం:
ఓట్స్ ఉప్మాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దానిని స్టవ్ మీద పెట్టుకొని అందులో నీటిని పోసుకుని మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసి ఆవాలు వేసి వేయించాల్సి ఉంటుంది.
ఇలా బాగా వేయించిన తర్వాత జీలకర్ర, పసుపు, కారం వేసి వేయించాలి.
బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి రంగు మారేంతవరకు బాగా వేయించుకోవాలి.
ఆ తర్వాత టమాటో ఇతర కూరగాయలు ఉప్పు వేసి మెత్తబడేంతవరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆ తర్వాత అందులోనే వేడి చేసుకున్న నీటిని వేసుకుని మరికొద్ది సేపు నీటిని తెర్ల కాగనివ్వాలి.
ఆ తర్వాత అందులో ఓట్స్ రవ్వ వేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి.
ఇలా బాగా ఉడికించిన తర్వాత కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. అంతే ఎంతో హెల్తీ రెసిపీ ఓట్స్ ఉప్మా తయారైనట్లే..
చిట్కాలు:
ఓట్స్ ఉప్మాలో కావాలనుకుంటే పెసలు లేదా చిక్కుళ్ళు కూడా వేసుకోవచ్చు.. వీటిని వెయ్యడం వల్ల ప్రోటీన్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఓట్స్ ఉప్మా మరింత స్పైసీగా కావాలనుకుంటే ఇందులో పచ్చిమిరపకాయలను కూడా వినియోగించవచ్చు.
అలాగే ఈ ఉప్మాలో పోషకాల శాతం పెంచాలని ఆకుకూరలను కూడా వేసి తయారు చేసుకోవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి