Weight Loss Tips: మనిషి ఆరోగ్యం అనేది చుట్టూ ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లోనే ఉంటుంది. ఈ పదార్ధాలను గుర్తించి సరైన పద్ధతిలో వినియోగించగలిగితే మంచి ఫలితాలుంటాయి. అందులో చాలా వరకూ ప్రతి కిచెన్‌లో లభించేవే. ఇవాళ మనం జీలకర్రతో కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి చర్చిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీలకర్ర అనేది దేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే పదార్ధం. కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి జీలకర్రతో. ప్రస్తుతం ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. శారీరక శ్రమ లేని పనులే ఎక్కువగా ఉండటం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం లేదా డైటింగ్ ఒక్కటే సరిపోదు. ఆయుర్వేదపరంగా కొన్ని చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సరైన ఫలితాలు కన్పిస్తాయి. 


దీనికోసం జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఒక అర చెంచా తేనెలో అర చెంచా జీలకర్ర వేసి అరగంట ఉంచాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకుని, గోరు వెచ్చని నీళ్లు తాగాలి. రాత్రి పడుకునే ముందైనా తీసుకోవచ్చు. ఇలా రోజూ చేస్తే 21 రోజుల్లోనే ఫలితం గమనిస్తారు. ఆ తరువాత ఈ ప్రక్రియను కొనసాగించాలి. అంతేకాకుండా రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం తప్పకుండా చేయాలి. 


రోజూ జీలకర్ర తేనెతో కలిపి తినడం వల్ల ఫిట్ అండ్ స్లిమ్‌గా మారడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. గొంతు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. కడుపులో ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలుంటే చాలా సులభంగా తగ్గిపోతాయి. 


జీలకర్రను నీళ్లలో ఉడికించి ఆ నీళ్లు చల్లారిన తరువాత కూడా తాగవచ్చు. చాలామంది ఉదయం జీలకర్ర నీళ్లు తాగుతుంటారు. తేనెతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలు వేగంగా కన్పిస్తాయి. ప్రధానంగా కడుపు కూడా శుభ్రమౌతుంది. కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకూ దూరమౌతాయి. 


Also read: Mudragada Challenge: పిఠాపురంలో పవన్‌ను ఓడించకుంటే పేరే మార్చేసుకుంటా, ముద్రగడ సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook