Mudragada Challenge: పిఠాపురంలో పవన్‌ను ఓడించకుంటే పేరే మార్చేసుకుంటా, ముద్రగడ సవాల్

Mudragada Challenge: ఏపీ ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ ఛాలెంజ్ చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 30, 2024, 02:42 PM IST
Mudragada Challenge: పిఠాపురంలో పవన్‌ను ఓడించకుంటే పేరే మార్చేసుకుంటా, ముద్రగడ సవాల్

Mudragada Challenge: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. కాపు నేతల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యేల్ని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని స్పష్టం చేశారు. 

పిఠాపురం ఎన్నిక పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభంగా మారుతోంది. పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాపు నేతలు, కాపు రిజర్వేషన్ అంశాలపై విమర్శలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు కాపు ఎమ్మెల్యేలను విమర్శించే అర్హతే పవన్‌కు లేదన్నారు. పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్‌ను ఓడించి తీరుతానని, లేని పక్షంలో తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. 

కాపు ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించకుండా, ఉద్యమంపై కనీసం సానుభూతి కూడా వ్యక్తపర్చకుండా కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్‌కు లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని జగన్ చెబితే తాను నోర్మూసుకున్నారని తిడుతున్న పవన్ ...తానెందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. ఇస్తానని మోసం చేసినవారిని వదిలేసి ముందే ఇవ్వనని చెప్పినవారి వెంటపడటం సరైందేనా అని నిలదీశారు. జక్కంపూడి రాజాను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాంచ్ అంటూ విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్..గతంలో ఆ పనిచేసుండవచ్చని ఎద్దేవా చేశారు. 

మీకు ఓటేయడానికి తామేమీ బానిసలసు కాదని స్పష్టం చేశారు. సమస్యలు తెలుసుకుని మాట్లాడాలని, ముఖానికి రంగుందని ఏది పడితే అది మాట్లాడితే కుదరన్నారు. పిఠాపురం నుంచి త్వరలో మిమ్మల్ని తన్ని తరిమేస్తారని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ప్రధానికి చెప్పి పవన్ కట్టిస్తానని చెప్పిన ప్రత్యేక జైలు చంద్రబాబు కోసమా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వద్ద అంత పలుకుబడే ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదని అడిగారు. 

Also read: Glass Symbol Issue: హైకోర్టుకు చేరిన గాజు గ్లాసు పంచాయితీ, రేపటికి వాయిదా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News