Weight loss Program: స్థూలకాయం ఇటీవలి కాలంలో సర్వత్రా కన్పిస్తున్న ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పని ఒత్తిడి ఇలా కారణాలు అనేకం. ఎన్ని ఉన్నా..సులభమైన చిట్కాలతో నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వంటి చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్డిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం..ఈ కారణాలన్నీ స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. స్థూలకాయం కారణంగా తరచూ పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. స్థూలకాయముంటే..గుండె, కిడ్నీ, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్య పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ బరువు తగ్గించుకోవాలనే ఆలోచన ఉంటుంది. బరువు తగ్గించే క్రమంలో జిమ్, వాకింగ్, డైటింగ్, సైక్లింగ్, యోగా ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంతమంది భోజనమే మానేస్తుంటారు. ఇంత చేసినా ఫలితాలుండవు. మరేం చేయాలి..బరువు ఎలా తగ్గించాలి..దీనికి సమాధానమే ఈ సులభమైన చిట్కాలు..


పరగడుపున ఇవి తింటే బరువు తగ్గడం ఖాయం


బొప్పాయి పండుని రోజూ క్రమం తప్పకుండా పరగడుపున తింటే వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా బొప్పాయి తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గేందుకు కీలకంగా మారుతుంది. బొప్పాయి తినడం వల్ల శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ అంటే విష వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. 


యాపిల్ రోజూ పరగడుపున తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఆపిల్‌లో ఉండే ఫైబర్ సహా ఇతర పోషక పదార్ధాలు బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. బొప్పాయి,యాపిల్ పండ్లతో కేవలం బరువు తగ్గించుకోవడమే కాకుండా ఇతర చాలా అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


బొప్పాయి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి ఇందుకు దోహదపడుతుంది. మరోవైపు డెంగ్యూ వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం సేవించమని వైద్యులు సూచిస్తుంటారు.


Also read: Belly Fat Reasons: బెల్లీఫ్యాట్‌పై తాజా అధ్యయనం, బెల్లీ ఫ్యాట్‌కు దారితీసే 5 ముఖ్య కారణాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook