Cauliflower Rice: ఈ రైస్ రోజూ తింటే మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు!
Cauliflower Rice recipe: బరువు తగ్గించడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్‌తో ఈ రెసిపీని తయారు చేసుకొని తింటే మరి కొన్ని ఆరోగ్యాలాభాలు కూడా పొందవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Cauliflower Rice recipe: నేటి కాలంలో చాలా మంది అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం చికిత్సలు, మందులు ఉపయెగిస్తుంటారు. కానీ బరువు తగ్గాలంటే ముందు ఆహర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహరంలో ప్రోటీన్, మినరల్స్, ఇతర ఖనిజాలు ఉండేలా చేసుకోవాలి.. అయితే క్యాలీఫ్లవర్ రైస్ బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేసుకోవడం సులభం. దీని కోసం ఎలాంటి పదార్థాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే పదార్థాలు వాడుతే సరిపోతుంది. ఇంతకీ ఎలా తయారు చేసుకోవాలి..? అనే వివిరాలు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
క్యాలీఫ్లవర్ - 1 ముక్క (చిన్న ముక్కలుగా కోసి, నీటిలో ఉడికించి, నీరు పిండి వేయాలి)
బాస్మతి బియ్యం - 1 కప్పు (ఉడికించి, నీరు పిండి వేయాలి)
క్యారెట్ - 1 (చిన్న ముక్కలుగా కోయాలి)
బఠానీలు - 1/2 కప్పు
స్ప్రింగ్ ఆనియన్ - 2 (చిన్న ముక్కలుగా కోయాలి)
వెల్లుల్లి రెబ్బలు - 2-3
ఇంజు - చిన్న ముక్క
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
వినెగర్ - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కారం పొడి - రుచికి తగినంత
గరం మసాలా - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా కోసి)
తయారీ విధానం:
ముందుగా వెల్లుల్లి, ఇంజును మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి. ఆ తరువాత వేడి నూనేలో వెల్లుల్లి-ఇంజు పేస్ట్ వేసి వేగించండి. ఇప్పుడు క్యారెట్, బఠానీలు, స్ప్రింగ్ ఆనియన్ వేసి వేగించండి. ఇందులోకి ఉడికించిన క్యాలీఫ్లవర్, బియ్యం వేసి బాగా కలపండి. ఆ తరువాత సోయా సాస్, వినెగర్, ఉప్పు, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. చిన్నగా కోసిన కొత్తిమీర వేసి కలపండి. వేడి వేడిగా క్యాలీఫ్లవర్ రైస్‌ను వడ్డించండి.
ఈ రెసిపీని ప్రతిరోజు తీసుకోకపోయిన లంచ్, రాత్రి భోజనంలో తయారు చేసుకొని తినవచ్చు. ఇది తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. బియ్యం కంటే క్యాలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.