డ్రై ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్యపరంగా అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్ చాలా ప్రత్యేకం. వాల్‌నట్స్ లాభాల గురించి పరిశీలిస్తే తక్షణం డైట్‌లో భాగంగా చేసుకుంటారు. కారణం స్థూలకాయం సమస్యకు అద్బుతంగా పనిచేయడమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలో అధిక బరువు లేదా స్థూలకాయం సమస్య పెరిగిపోతోంది. స్థూలకాయం సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఒక్క సమస్యతో అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పేరుకుందంటే మీ రోజువారీ డైట్‌లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని అర్దం చేసుకోవాలి. లేకపోతే లేనిపోని సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే వాల్‌నట్ తీసుకుంటే క్రమక్రమంగా బరువు తగ్గడమే కాకుండా నియంత్రణలో ఉంటుంది. 


వాల్‌నట్స్ రోజూ తింటే కలిగే ప్రయోజనాలు


వాల్‌నట్స్‌లో ఉండే లినోలెనిక్ యాసిడ్ ఎముకల్ని పటిష్టం చేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేయడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా గర్భిణీ మహిళలకు చాలా మేలు చేకూరుస్తుంది. వాల్‌నట్స్ రోజూ తింటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 


వాల్‌నట్స్‌లో ఉండే ఐరన్, కాల్షియం, కాపర్, ప్రోటీన్లు, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఫాస్పరస్ వంటి అత్యవసరమైన న్యూట్రియంట్లు శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి కూడా దూరమౌతాయి. వాల్‌నట్స్ రోజూ తింటే గుండె ఆరోగ్యానికి మంచిది. హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. 


వాల్‌నట్స్ తీసుకుంటే చాలా సేపు ఆకలనేది వేయదు. అంతేకాకుండా ఎనర్జీ కొనసాగుతుంది. ఫలితంగా క్రేవిటీ తగ్గి బరువు నియంత్రణలో వస్తుంది. అందుకే వాల్‌నట్స్ బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. వాల్‌నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. అందుకే విద్యార్ధులకు చాలా మంచిది. వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతేకాదు..ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంటువ్యాధుల భయం ఉండదు. 


Also read: Beauty Tips: చర్మ నిగారింపు, అందం కావాలంటే బ్యూటీ క్రీమ్స్ అవసరం లేదు, ఇది తింటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook