Weight Loss Tips: ఆధునిక జీవన శైలిలో..మారుతున్న ప్రపంచంలో స్థూలకాయం ప్రతి ఒక్కరికీ ఓ సమస్యగా మారుతోంది. ఆహారపు ఆలవాట్లు సరిగ్గా ఉంటే బరువు తగ్గడం పెద్ద సమస్యేం కాదు. ఈ క్రమంలో బ్రేక్‌ఫాస్ట్ , లంచ్, డిన్నర్‌లో ఏం తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్యం ఉరుకులు పరుగుల ప్రపంచం. చెడు ఆహారపు అలవాట్లతో బరువు విపరీతంగా పెరిగిపోతున్నారు. స్థూలకాయం ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. స్థూలకాయం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే బరువు తగ్గించుకోవడమనేది చాలా చాలా ముఖ్యం. బరువు తగ్గించుకునే క్రమంలో...జిమ్‌లు, వర్కవుట్లు, రన్నింగ్, వాకింగ్, డైటింగ్ ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆరోగ్యకరమైన డైట్‌తో కూడా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఏం తీసుకుంటే మంచిదో వివరిస్తున్నారు. 


బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలి


ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారంలో చాలామంది పరాఠా, ఫ్రైడ్ పదార్ధాలు తింటుంటారు. కానీ రవ్వ దోశె ఆరోగ్యానికి మంచిది. రవ్వ దోశ అనేది బరువు తగ్గడంలో దోహదపడుతుంది. రవ్వ దోశెలో కాస్త బట్టర్ వేసుకుంటే ఇంకా మంచిది. తేలిగ్గా ఉంటూనే..ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఎగ్ చాట్ ప్రొటీన్ కూడా మంచిదే. ఇందులో గుడ్ ఫ్యాట్స్, విటమిన్లు మెండుగా ఉంటాయి. బరువు తగ్గేందుకు మంచి డైట్ ఇది. దీనివల్ల ఆకలి త్వరగా వేయదు. అదే సమయంలో ఎనర్జీ లభిస్తుంది. 


మద్యాహ్నం లంచ్‌లో..


ఇక లంచ్‌లో పరాఠాలు మంచిదే. పరాఠా పిండిలా వాము కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పరాఠాలను ఆలివ్ ఆయిల్‌తో వండితే ఆరోగ్యపరంగా మంచిది. ఇష్టమైన కూరతో పరాఠాలు కడుపు నిండుగా తీసుకోవడం మంచిది. లేదా ఆకు కూరలతో భోజనం చేసినా ఫరవాలేదు. 


రాత్రి భోజనం..


మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఆవకాడో శాండ్‌విచ్ రాత్రి వేళ చాలా మంచిదంటున్నారు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ రెండు స్లైడ్స్ తీసుకుంటే చాలు. అవకాడో గురుజు స్లైడ్స్‌కు రాసుకుని తినాలి. అదనంగా కేరట్, షిమ్లా మిర్చి, పన్నీర్ వేస్తే ఇంకా మంచిది. ఈ విధమైన డైట్ ఆరోగ్యానికి మంచిదే కాకుండా..బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 


Also read: Women Google Search: పెళ్లికి ముందు అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా, ఉలిక్కిపడాల్సిందే



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook