Weight Loss Tips: అధిక బరువు లేదా స్థూలకాయం..ప్రస్తుతం ఎదురౌతున్న ప్రధాన సమస్య. అధిక బరువుని తగ్గించాలంటే ముందుగా చేయాల్సింది ఆహారపు అలవాట్లలో మార్పు. ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు..అదెలాగో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలిలో అధిక బరువు లేదా స్థూలకాయమనేది ఓ పెను సమస్యగా మారుతోంది. ఆయిలీ ఫుడ్స్ రోజూ తీసుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధిక బరువనేది పలు సమస్యలకు దారితీస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకుంటే..ఆహారపు అలవాట్లను ముందుగా మార్చుకోవాలి. జిమ్‌లో వర్కవుట్లతో శ్రమ పడటం వల్ల పూర్తిగా ప్రయోజనముండదు. లైఫ్‌స్టైల్‌లో మార్పుల ద్వారా మాత్రమే బరువు తగ్గించడం సాధ్యం. 


బరువు తగ్గించేందుకు సులభమైన మార్గాలు


ఉదయం వేళ ఏం చేయాలి


ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేవాల్సి ఉంటుంది. గ్రీన్ టీతో రోజూ ఉదయాన్ని ప్రారంభించాలి. ప్రతిరోజూ 3-5 కిలోమీటర్ల నడవడం వల్ల శరీరం నుంచి చెమట బయటకువస్తుంది. ఆ తరువాత ఇంటికెళ్లి..బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్, పండ్లు తీసుకోవాలి. ఇవి తక్కువ కేలరీలుండే ఆహార పదార్ధాలు. ఫలితంగా మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది.


మద్యాహ్నం ఏం తినాలి


మద్యాహ్నం భోజనం ఎప్పుడూ బలంగా తీసుకోవాలంటారు. అయితే బరువు తగ్గించుకోవాలనుకునేవారికి ఇది వర్తించదు. మద్యాహ్నం వేళ 2 చపాతీలు, కాస్త అన్నం, ప్రోటీన్లుండే పప్పులు, ఆకుపచ్చ కూరగాయలు తినాల్సి ఉంటుంది. భోజనం తరువాత మజ్జిగ లేదా లస్సీ తప్పకుండా తీసుకోవాలి. 


రాత్రి డిన్నర్‌లో ఏముండాలి


రాత్రి భోజనం ఎప్పుడూ ప్రయోజనకరమే. రాత్రి భోజనం ఎప్పుడూ తేలిగ్గా ఉండాలి. ఫలితంగా నిద్ర సమయానికి పడుతుంది. రాత్రి భోజనంలో చిలకడదుంప మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి..స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొవ్వు కరిగించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా కేవలం పదిరోజుల్లో 5 కిలోల వరకూ బరువు తగ్గించుకోవచ్చు.


Also read: Aloevera Face: ఈ ఫేస్‌ ఫ్యాక్‌తో కేవలం 5 నిమిషాల్లో చర్మాన్ని నిగనిగ లాడించవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook