Weight loss tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామందికి బరువు పెద్ద సమస్యగా మారుతోంది. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీనికోసం కొన్ని రకాల పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం ఓ సమస్యగా మారుతుంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ముందుగా నియంత్రించాల్సింది ఆహారపు అలవాట్లే. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. దీనికోసం కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి. బరువు తగ్గించేందుకు వ్యాయామం ఒక్కటే సరిపోదని చాలా సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. వ్యాయామంతో పాటు డైట్ కంట్రోల్ తప్పనిసరి. 


బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, సోయా సీడ్స్, ఆనపకాయ విత్తనాలు, అవిశె గింజలు వంటివి ఇందులో ప్రధానమైనవి. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


మటర్ అనేది సాధారణంగా వివిధ రకాల కూరల్లో కలిపి వినియోగిస్తుంటారు. రోజూ వీటిని సేవించడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందులో పోషక పదార్ధాలు పెద్దఎత్తున లభిస్తాయి.


శెనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గించేందుకు అద్భుతంగా దోహదపడతాయి. ఫ్రై చేసిన శెనగలు లేదా ఉడకబెట్టిన శెనగల్ని స్నాక్స్ రూపంలో తరచూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఫ్రైడ్ శెనగల్ని తినడం వల్ల ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. 


Also read: Summer Drinks: శరీరంలో వేడి తగ్గించి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే 5 అద్భుతమైన డ్రింక్స్ ఇవే


బాదంలో ఫైబర్ సమృద్దిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గించే ప్రక్రియలో బాదం ఉపయోగం చాలా విరివిగా ఉంటుంది. సాయంత్రం వేళ స్నాక్స్ రూపంలో బాదం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు శరీరంలో ఉండే అదనపు కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. 


Also read: Summer drinks: వేసవిలో మీ ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి చాలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook