Weight Reduce: బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. కానీ జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ మాత్రం చేయరు. అందుకే ఇప్పుడు మేం చెప్పే కొన్ని ఎక్సర్‌సైజ్‌ల ద్వారా మీరు జిమ్‌కు వెళ్లకుండానే..ఇంట్లోనే బరువు తగ్గించుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిమ్‌కు వెళ్లి ఏ విధమైన వర్కవుట్స్ చేయకుండానే బరువు తగ్గాలని అనుకుంటారు. అంతేకాదు తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాలని కోరుకుంటచారు. అందరూ బిజీ లైఫ్‌లో గడపడం వల్ల వచ్చిన సమస్య ఇది. అందుకే తక్కువ సమయం వెచ్చించి..ఎక్కువ బరువు తగ్గే పద్ధతుల గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుుడు మేం మీకు చెప్పబోయే ఎక్సర్‌సైజ్ కూడా జిమ్‌కు వెళ్లకుండా..ఇంట్లో కూర్చుని చేస్తూనే బరువు తగ్గించుకోవచ్చు. 


స్క్వాట్ యాంకిల్ టచ్


ఈ ఎక్సర్‌సైజ్ చేయడానికి మీ రెండు భుజాల వెడల్పులో కాళ్లను కాస్త ఓపెన్ చేసి నిలవాలి. చేతుల్ని మీ వెనుక వైపుగా పెట్టండి. ఆ తరువాత మోకాళ్లపై వంగి..మీ ఎడమ మోకాలిని ముందుకు జరిపి..మీ బాడీ బరువుని అదే కాలిపై ఉంచాలి. అదే సమయంలో మీ కుడి కాలిని పైకి లేపాలి. ఇప్పుడు ఎడమ కాలి సహాయంతో మీ కుడి మోకాలిని టచ్ చేయాలి. ఆ తరువాత మందున్న పొజీషన్‌కు తిరిగి రావాలి. ఇలా రోజుకు పదిసార్లు చేయాలి. 


రోప్ స్కిప్పింగ్


స్కిప్పింగ్ చాలా మంచి ఎక్సర్‌సైజ్. మీ మొత్తం బాడీ ఫిట్‌గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్కిప్పింగ్ చేయాలి. ఇలా చేస్తే ఎప్పటికీ ఫిట్‌గా ఉంటారు. 


పుష్ అప్ ఆర్మ్‌ త్రో


ఎక్సర్‌సైజ్ చేసేందుకు మీరు మీ ముఖాన్ని నేలవైపుకు పెట్టి బోర్లా పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్లను ఒకటిగా ఉంచి..మీ బరువును ఛాతీపై పెట్టి..రెండు చేతులను భుజాల దూరంలో ఉంచి..అరచేతిపై ఉండాలి. ఆ తరువాత తల నుంచి హీల్స్ వరకూ స్ట్రైట్ లైన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిని ప్లాంక్ అంటారు. ఆ తరవాత మీ ఎడమ చేత్తో కుడి చేతిని..తరువాత కుడిచేత్తో ఎడమ చేతిని తాకుతుండాలి. ఇలా రోజుకు పది సార్లు చేయాలి. ఇలా చేస్తే బరువు సులభంగా తగ్గుతారు. 


Also read: Skin Care Tips:Skin Care Tips: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook