Weight loss with aloo bukhara: ఆలు బుఖారా మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఎండకాలం ఈ పండ్లు తినడం వల్ల మీరు రోజంతటికీ కావాల్సిన శక్తి అందుతుంది. అంతేకాదు దీంతో బరువు కూడా తగ్గిపోతారు. అది ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబర్ పుష్కలం..
ఆలూబుఖారాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గిస్తుంది. ఆలూబుఖారా తినడం వ్లల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయంపాటు ఆకలి వేయదు. దీంతో అతిగా తినకుండా ఉంటారు. అంతేకాదు ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.దీంతో బరువు పెరగకుండా ఉంటారు.


క్యాలరీలు తక్కువ..
ప్లమ్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక మీడియం సైజు ఆలూ బుఖారాలో 40 క్యాలరీలు ఉంటాయి. ఇది మీ స్నాక్ లా తింటే బరువు పెరగరు. ఇది తీయగా, జ్యూసీగా ఉంటుంది.


హైడ్రేషన్..
ఆలూబుఖారాలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది ఎండకాలం మిమ్మల్ని కాపాడుతుంది. ఆలూబుఖారాలో ఎలక్ట్రాలైట్‌, పొటాషియం ఉంటుంది. ఇది మన శరీరంలో ఆరోగ్యకరమైన ఫ్లూయిడ్స్ ను పెంచుతుంది. 


జీర్ణ ఆరోగ్యం..
ఆలుబుఖారాలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కరగని ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆలు బుఖారాలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం ఉండదు.


ఇమ్యూనిటీ..
ప్లమ్‌లో విటమిన్ సీ, శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థకు సహాయపడుతుంది. విటమిన్ సీ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్‌ సమస్యను నివారించి సెల్ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. 


ఇదీ చదవండి: ఒక చుక్క కొబ్బరినూనె మీ ముఖానికి రాస్తే హిరోయిన్ వంటి అందమైన చర్మం మీదే..


చర్మ ఆరోగ్యం..
ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఆంథోసైనిన్స్ కనిపిస్తాయి. ఆలుబుఖారాలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. సన్ డ్యామేజ్ కాకుండా మీ చర్మాన్ని కాపాడుతుంది. ముఖంపై గీతలు, మచ్చలు రాకుండా ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది.


గుండె ఆరోగ్యం..
ఆలూ బుఖారాలో ఫినోలిక్‌ కంపౌండ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆలు బుఖారాను మీ డైట్లో చేర్చుకుంటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారించవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి:  ఈ కూరగాయలు తింటే చాలు మీ ముఖంపై సహజంగానే మెరుపువస్తుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter