Weight Loss With Amla Murabba: ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల తీవ్ర వ్యాధులకు మూలికలు ఉన్నాయి. పురాతన కాలం నుంచే ఇది అందుబాటులో ఉంది. అయితే ఉసిరికాయ కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఒక మూలికనే. ఇదుంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఉసిరితో చేసన జామ్‌ను ఖాళీ కడుపుతో తింటే.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇలా ఈ జామ్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే చాలు సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా కొందరిలో మధుమేహం సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది. అయితే ఈ జామ్‌ను కూడా పిల్లలకు ఆహారాన్ని ఇచ్చే ముందు ఇస్తే చాలు వారిలో శరీర అభివృద్ధి జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ జామ్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖాళీ కడుపుతో ఉసిరి జామ్ తినడం వల్ల కలిగే:


బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:
ఈ జామ్ శరీర బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో అమినో యాసిడ్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి జీర్ణక్రయన మెరుగు పరిచేందుకు సహాయపడతాయి. అయితే బరువు పెరడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ జామ్‌ను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


చర్మ సమస్యలకు చెక్‌ పెడుతుంది:
ఉసిరి జామ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. క్రమం తప్పకుడా ఉదయాన్నే ఉసిరి  జామ్ తినడం వల్ల చర్మంపై మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. అంతేకాకుండా ఈ జామ్‌లో విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చర్మ వృద్ధాప్యాన్ని కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది.


గుండె సమస్యలను తగ్గిస్తుంది:
ఉసిరి జామ్ గుండె సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ జామ్‌ను రోజూ ఉదయం పూట టీకి ముందు తీసుకోవడం వల్ల  శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి.. గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.


 


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook