Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును మాయం చేసే అద్భుతమైన చిట్కా, కేవలం వారంలోనే బెల్లీ ప్యాట్‌కు చెక్
Weight Loss Tips: ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అధిక బరువు పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చితే..కేవలం వారం రోజుల్లోనే స్లిమ్‌గా మారడం ఖాయం.
Weight Loss Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం లేదా అధిక బరువు ఇటీవల ప్రధాన సమస్యగా మారుతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో కేవలం వారం రోజుల్లోనే అధిక బరువుకు చెక్ పెట్టి..ఫిట్ అండ్ స్లిమ్ కావచ్చు.
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంటారు. లైఫ్‌స్టైల్ కారణంగా ఎదురవుతున్న అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఎక్సర్‌సైజ్, యోగా, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇంత చేసినా బరువు తగ్గరు. ఈ పరిస్థితుల్లో మీ డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చడం ద్వారా కేవలం వారం రోజుల వ్యవధిలో ఫిట్ అండ్ స్లిమ్‌గా మారవచ్చు.
బీన్స్
బీన్స్ అనేవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. బీన్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరం బరువు నియంత్రణలో ఉంటుంది. దాంతోపాటు పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు వేగంగా కరుగుతుంది. బీన్స్ తినడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రోజూ బీన్స్ తీసుకుంటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్టుంటుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
క్యారట్
క్యారట్‌లో జింక్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా పొట్టు చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది. అంతేకాదు..క్యారట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
కీరా
కీరా ఆరోగ్యానికి కావల్సిన అద్భుతమైన పదార్ధం. రోజూ క్రమం తప్పకుండా కీరా తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్యే ఉత్పన్నం కాదు. శరీరంలో విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. కీరా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అదే సమయంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Also read: Dates Benefits: ఖర్జూరం పండ్లతో అధిక బరువుకు చెక్..ఇలా చేస్తే కేవలం 2 నెలల్లో పది కిలోల బరువు మైనస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook