Mouth Dry Reasons: ఉదయం లేవగానే నోరు ఎండిపోయినట్టుగా ఉంటుందా? ఈ సమస్యకు కారణాలేంటి?
Mouth Dry In Morning: ఉదయం నిద్రలేవగానే నోరు ఎండిపోయినట్లుగా ఉంటుందా? అతిగా నీరు తీసుకుంటున్నారా? అయితే ఈ లక్షణాలు అన్ని ఈ సమస్యలు కారణమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకు నోరు అతిగా ఎండిపోతుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mouth Dry In Morning: మనలో చాలా మంది ఉదయం లేచిన తరువాత నోరు ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందని మనలో సందేహం కలుగుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం ఉదయం నిద్ర లేవగానే నోరు ఎండిపోవడాన్ని జిరోస్టోమియా అని చెబుతున్నారు. ఇది ఆరోగ్య సమస్యలు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. నోరు ఎండిపోవడానికి కారణం ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా వహించడానికి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. ఈ నోరు ఎండిపోయే సమస్య ఉన్నవారు ఫంగస్, ఇన్ఫెక్షన్ వంటి ఇతర సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు బారిన పడాల్సిన అవసరం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
అయితే నోరు అతిగా ఎండిపోయినట్టుగా ఉండటం వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం తెలుసుకుం
నిద్రలేమి సమస్యలు:
నిద్రలేమికి సమస్యల కారణంగా నోరు అతి పొడిగా మారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్సియా- హైపోప్నియా సిండ్రోమ్ తో బాధపడే వ్యక్తి నిద్రంచే సమయంలో వాయుమార్గంలో గాలి బ్లాక్ అవుతుంది. దీని వల్ల వారు తరుచుగా గురకతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే నోరు ఎక్కువగా పొడిబారుతుంది.
మెడిసిన్‌లు:
ఈ నోరు ఎండిపోవడానికి మరో కారణం మెడిసిన్‌లు ఎక్కువగా తీసుకోవడం. చాలా మంది రాత్రిపూట మందులను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల నోరు పొడిబారుతుంది. ముఖ్యంగా ఈ లక్షణం రక్తపోటు మందులను ఉపయోగించే వారి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆటో ఇమ్యూన్:
ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడేవారిలో కూడా ఈ నోరు పొడిబారడానికి కారణమవుతుంది. ఇది లాలాజలం ఉత్పత్తి కణాల కారణంగా కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు శరీరానికి కావాల్సిన నీరును తీసుకోవాల్సి ఉంటుంది.
డీహైడ్రేషన్:
డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారిలో కూడా ఈ నోరు పొడిబారడం జరుగుతుంది. ఈ సమస్య కారణంగా వాంతులు, విరేచనాలు, దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది.
క్యాన్సర్:
రేడియేషన్ థెరపీ చేయించుకునే వ్యక్తులలో నోరు పొడిబారడం సాధారణ సమస్య. ఇది మీ లాలాజల గ్రంథులు దెబ్బతీస్తుంది. దీని వల్ల నోరు ఎండిపోయే అవకాశం ఉంది.
అతిగా మద్యం:
మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది. ఈ కారణంగా నోరు అతిగా పొడిబారుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా మద్యం తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి