Diabetes Causes: డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా.. ఎందుకు ఇలా చేస్తే సులభంగా మధుమేహం వస్తోంది..?
What Causes Diabetes: మధుమేహం రావడానికి చాలా రకాల కారణాలున్నాయి. అయితే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తీసుకుంటున్నారు. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
What Causes Diabetes: మధుమేహం అనేది చెప్పి ఎవరికి రాదు. వారు జీవించే అలవాట్ల వల్ల, ఆధునిక జీవన శైలి కారణంగా, ఆహారాల్లో మార్పులు వల్ల వచ్చే అవకాశాలున్నాయి. డయాబెటిస్ అనేది ప్రస్తుతం పెద్దువారిలోనే కాకుండా చిన్న పిల్లలో కూడా వస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణాలు జన్యు సంబంధితమైనవి కూడా కావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌లు. టైప్ 1 డయాబెటిస్ అనేది కేవలం జన్యు పరంగా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ వ్యాధి బారిన పడకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 మధుమేహాన్ని నియంత్రంచుకోవడం చాలా కష్టమైనప్పటికీ.. టైప్ 2 మధుమేహానికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇలా చేయడం వల్ల మధుమేహం వస్తోంది:
అల్పాహారం తీసుకోవడం:
ప్రస్తుతం చాలా మంది ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానుకుంటున్నారు. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఉదయం టిఫిన్ తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టిఫిన్ తినకపోవడం వల్ల నేరుగా లంచ్ తినడం వల్ల కూడా మధుమేహానికి దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చాలా సేపు ఒకే చోట కూర్చొని ఉంటున్నారు:
ఆఫీసుల్లో చాలా మంది ఒకే చోట కూర్చిన ఉంటున్నారు. అయితే దీని వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒకే చోట తరుచుగా కూర్చోవడం వల్ల మధుమేహం బారిన కూడా పడొచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఎక్కువ సేపు కూర్చోవడం హానికరమని నిపుణులు తెలుపుతున్నారు.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం:
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం కూడా మధుమేహానికి దారి తీయోచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల జీవక్రియలపై ప్రభావం పడి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మద్యపానం, ధూమపానం:
మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కూడా మధుమేహం రావొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మద్యపానం చేసేవారిలో మధుమేహం 30 నుంచి 40 శాతం వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..
Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook