Camel Milk Wax: అవాంఛిత రోమాలు మహిళలకు అతిపెద్ద సమస్యగా మారుతుంటాయి. ఇప్పుడీ సమస్యకు పరిష్కారంగా క్యామెల్ మిల్క్ వ్యాక్స్ అందుబాటులో వచ్చింది. ఇది ఎంతవరకూ పనిచేస్తుంది..నిజంగా హెయిర్ గ్రోత్ నిలువరిస్తుందా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలకు అవాంఛిత రోమాల సమస్య అంటే తల తప్పించి ఇతర భాగాలపై రోమాలు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ అవాంఛిత రోమాల్ని తొలగించుకునేందుకు వ్యాక్సింగ్‌పై ఆధారపడుతుంటారు. ఇది సులభమైంది, చవకైంది కూడా. అయితే మార్కెట్‌లో చాలా రకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉండటంతో ఏది మంచిదో నిర్ణయించుకోలేని పరిస్థితి. చాలామంది హెయిర్ రిమూవల్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. 


హెయిర్ రిమూవల్ కోసం క్యామెల్ మిల్క్ వ్యాక్స్ కొత్తగా అందుబాటులో వస్తోంది. ఇది ఎంతవరకూ బాగుంటుందనే ఆసక్తి ఉంది అందరిలో. ఇది నొప్పి లేకుండా చాలా స్మూత్‌గా ఉందని కొందరంటున్నారు. క్యామెల్ మిల్క్ వ్యాక్స్‌‌తో సైడ్‌ఎఫెక్ట్స్ ఏవీ లేవంటున్నారు. అవాంఛిత రోమాల్ని తొలగించడమే కాకుండా..ట్యాన్ సమస్య, చర్మంపై మచ్చల్ని కూడా పోగొడుతోందట. ఇందులో సల్ఫేట్, అమ్మోనియా, సిలికా లేవు. ఈ వ్యాక్స్ కేవలం నారింజ తొక్కల పౌడర్, క్యామెల్ మిల్క్ పౌడర్, కోకోనట్ మిల్క్ పౌడర్, అల్లోవెరా మిల్క్ పౌడర్, నిమ్మకాయ తొక్కల పౌడర్, కాఫీ పౌడర్‌తో తయారైంది. 


క్యామెల్ మిల్క్ వ్యాక్స్ ఎంతసేపు పడుతుంది


క్యామెల్ మిల్క్ వ్యాక్స్‌తో సాధారణంగా బాడీపై ఉండే హెయిర్ తొలగించేందుకు 10-12 నిమిషాలు పడుతుంది. ఫేసియల్ హెయిర్ తొలగించేందుకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. బాడీ హెయిర్ తొలగించేందుకు బికినీ వ్యాక్స్‌గా కూడా వాడవచ్చు. పెయిన్ ఫుల్ వ్యాక్సింగ్ భరించలేనివారికి ఇదొక మంచి మార్గం. 


ఎలా అప్లై చేయాలి


క్యామెల్ మిల్క్ వ్యాక్స్ పౌడర్‌ను ముందుగా రోజ్ వాటర్ లేదా సాధారణ నీళ్లలో మిక్స్ చేయాలి. దట్టమైన మిశ్రమంగా చేసి చర్మానికి రాయాలి. పది నిమిషాలు ఆగిన తరువాత బట్టతో క్లీన్ చేయాలి. క్యామెల్ మిల్క్‌లో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల చర్మానికి ఉపయోగకరం. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కారణంగా చర్మం మృదువుగా, స్మూత్‌గా ఉంటుంది. ఇదొక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. 


Also read: Excessive Protein Diet: ప్రోటీన్లు గల ఆహార పదార్థాలను అతిగా తింటే ప్రమాదమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook