Summer Healthy Foods: వేసవికాలంలో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా వడ దెబ్బ బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలని అంటే కొన్ని సింపుల్‌ టిప్స్‌ను పాటిస్తేసరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వేసవి కాలంలో ఎలాంటి సమస్యల వల్ల నష్టం కలగకుండా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవికాలంలో  ఈ టిప్స్‌ పాటించండి: 


వేసవికాలంలో తేలికగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది.  అధిక కొవ్వు, నూనెతో తయారు చేసిన వంటలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. దీని వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తుతాయి. 


అలాగే వేసవికాలంలో బీరకాయ, పొన్నగంటి, బచ్చలి కూర ఇతర పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల శరీరానికి నీరు, కడుపు చల్లగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 


దీంతో పాటు పండ్లు కూడా తీసుకోవడం ఎంతో శ్రేయస్సు. పండ్లలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంజీర, ద్రాక్ష, ఆరెంజ్‌, యాపిల్ వంటి పండలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే గోధుమ పిండితో చేసిన పూరీలకన్నా గోధమ రవ్వతో తయారు చేసే ఉప్మా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 


 వేసవికాలంలో డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు రసం కంటే చెరుకు ముక్కలను తినడం ఎంతో మంచిది. గ్లాసులో మూడొంతుల నీటికి పావు వంతు నిమ్మరసం కలుపుకుని తాగితే వేసవి తాపం తీరుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఉదయం పూట గోరువచ్చెని పాలలో ఆటుకులు వేసుకుని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుందని చెబుతున్నారు. 


Also Read:  Foamy Urine Causes: మూత్రంలో నురుగు వస్తే తస్మాత్‌ జాగ్రత్త..ఎందుకంటే!


ప్రతిరోజు టీ, కాఫీ కన్నా కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బార్లీ గింజల్లో నీరుపోసి, ఉడికిన తరువాత ఉప్పు వేసుకొని తాగుతే చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం  తీసుకొనే టిఫిన్స్ ,  స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 


Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook