Wheatgrass Juice Benefits: వీట్‌గ్రాస్ పేరును చాలాసార్లు విని ఉంటారు. ఇది ఎక్కడైన సులభంగా లభిస్తుంది. అయితే వీట్‌ గ్రాస్‌ను గోధుమలను మొలకెత్తించి పెంచుతారు. అయితే  సాధరణ గడ్డిలా కనిపించినప్పటికీ  ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ గడ్డిలో ఉండే గుణాలు మెటబాలిక్ ఎనర్జీని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీట్‌గ్రాస్‌ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల క్యాన్సర్ కణాలను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే  రక్తపోటును నియంత్రించి.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర ప్రయోజనాలను కూడా చేర్చుతుంది. అయితే ఈ జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


గోధుమ గడ్డిలో విటమిన్లు:
గోధుమ గడ్డి గోధుమల అంకురోత్పత్తి నుంచి వస్తుంది. ఇందులో గ్లూటాతియోన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాకుండా క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. దీంతో అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది.


వీట్ గ్రాస్ పోషకాలు:
గోధుమ గడ్డిలో అనేక విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం 


Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook