White Hair To Black Hair: ప్రస్తుతం చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం పెద్ద సమస్యగా మారింది.  చిన్న నుంచి పెద్ద వరకు జుట్టు నెరసిపోవడం, రాలిపోవడం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఒక్క సారి జుట్టు తెల్లగా మారితే సహజమైన నల్ల జుట్టును పొందడం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక జీవనశైలిలో మార్పులతో పాటు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలను తీసుకుంటే తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్ల జుట్టు కోసం ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోండి:
పాల ఉత్పత్తులు:

శరీరంలో పోషక లోపం వల్లే తెల్ల జుట్టు సమస్యలు వస్తాయి. కాబట్టి అధికంగా పోషకాలున్న ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు. అందుకోసం ప్రతి రోజు ఆహారంలో పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12, కాల్షియం, ప్రోటీన్, ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 


గుడ్డు:
శరీరానికి తగిన పరిమాణంలో ప్రోటీన్స్‌ అందడానికి తప్పకుండా ప్రతి రోజు రెండు గుడ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రతి రోజు ఎగ్ సలాడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి12 కూడా పుష్కలంగా లభిస్తుంది. సులభంగా జుట్టును నల్లగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 


Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?


సోయాబీన్స్:
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో సోయాబీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దీంతో శరీరానికి యాంటీ-ఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో లభించి జుట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. 


ఆకు కూరలు:
పచ్చని ఆకు కూరల్లో కూడా విటమిన్స్ అధికంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. ప్రతి రోజూ ఆహారంలో బచ్చలికూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ తీసుకుంటే..శరీరానికి ఐరన్, విటమిన్లు, కాల్షియం, ఫోలేట్ లభిస్తాయి. 


పుట్టగొడుగు:
తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పుట్టగొడుగులు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే రాగి మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. 


Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook