COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

White Hair To Black Hair: కొన్ని సంవత్సరాల క్రితం వృద్ధాప్యంలో తెల్ల జుట్టు వచ్చేది.. కానీ ఆధునిక జీవన శైలి కారణంగా యువతలో కూడా తెల్ల జుట్టు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ తెల్ల జుట్టు వస్తోంది. ఈ సమస్యతో బాధపడేవారు తరచుగా మార్కెట్లో లభించే అనేక రకాల ప్రోడక్ట్లను వినియోగిస్తూ ఉంటున్నారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ కేవలం కొన్ని రోజుల పాటే దీని ప్రభావం ఉంటుంది ఆ తర్వాత ఎప్పటిలాగే జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది. అంతేకాకుండా చాలామందిలో రసాయనాలతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.


తెల్ల జుట్టుకు బ్లాక్ టీ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఈ రెమెడీని తయారు చేయడానికి ముందుగా బ్లాక్ టీ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే రెండు గ్రీన్ టీ బ్యాగులను వేసుకొని సన్నని మంటపై బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత వడబోసుకొవాలి. ఇలా తయారు బ్లాక్ టీ చల్లారిన తర్వాత కాటన్ గుడ్డతో జుట్టుకు అప్లై చేసుకుంటే చాలు. ఇలా క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా దృఢంగా తయారవుతుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


నిమ్మరసం, కొబ్బరి నూనె:
నిమ్మరసంలో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అయితే దీనిని చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇదే నిమ్మరసంలో నాలుగు టీ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


కరివేపాకు, కొబ్బరి నూనె మిశ్రమం:
కరివేపాకు తెల్ల జుట్టుకు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకును మిశ్రమంలో తయారు చేసుకోవాలి. అందులోని తగినంత కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి