White Hair To Black: తెల్ల జుట్టుకు బెస్ట్ హోమ్ రెమెడీస్..ఇవి వారానికి ఒకసారి అప్లై చేస్తే చాలు శాశ్వతంగా నల్ల జుట్టు పొందుతారు!
White Hair To Black Naturally Permanent: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
White Hair To Black Naturally Permanent: ప్రస్తుతం తెల్ల జుట్టు అనేది సాధారణ సమస్యగా మారింది. ఎక్కువగా ఈ సమస్య ఆధునిక జీవన శైలి పాటించే యువతలో వస్తోంది. ఈ తెల్ల జుట్టు కారణంగా ముఖం అంద హీనంగా తయారవ్వడమే కాకుండా.. వృద్ధాప్యం గడుపుతున్న వారిలా కనిపిస్తారు. ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెన్నతో హెయిర్ డైస్ ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.
దీనివల్ల కొంతకాలం ఫలితం పొందినప్పటికీ..మళ్లీ ఎప్పట్లాగే తెల్ల జుట్టు రావడం ప్రారంభమవుతోంది. అంతేకాకుండా కొందరిలో వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల ముఖంలో ముఖంపై వాపు కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగించి తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు.
తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. ఆయుర్వేద గుణాలు కలిగిన మందారం పువ్వు, ఉసిరిని మిశ్రమంలో చేసి వినియోగించడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉసిరి పొడిని హెయిర్ డైలా తయారు చేసుకొని వారానికి ఒకరోజు వినియోగించడం వల్ల శాశ్వతంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా జుట్టు కుదుళ్ల నుంచి కూడా దృఢంగా మారుతుంది.
తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు పచ్చి ఉసిరిని కూడా వినియోగించవచ్చు. ఈ పచ్చి ఉసిరిని హెయిర్ మాస్క్ గా వాడడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా తయారవ్వడమే కాకుండా లోపలి నుంచి షైనింగ్ కూడా వస్తుంది. అయితే ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా నాలుగు ఉసిరికాయలను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
ఆ తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ హెన్నా పౌడర్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి రసాయనాలు లేని షాంపూ తో శుభ్రం చేసుకోవాలి.
తెల్ల జుట్టుకు ఉల్లిపాయ కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు ఊడిపోయిన జుట్టును తిరిగి తెప్పించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా కుదుళ్ళ నుంచి జుట్టును బలంగా చేసేందుకు కూడా దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రెమెడీని వినియోగించాలనుకునేవారు ముందుగా రెండు ఉల్లిపాయలను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మిశ్రమంలా తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook