How To Turn White Hair To Black Naturally: ఆహార పలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో తెల్ల జుట్టు చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇలాంటి సమస్య ఎక్కువగా యువతలోనే వస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది యువతలో జుట్టు తెల్లగా మారి..రాలిపోవడం కూడా ప్రారంభం అవుతోంది. అయితే యువత ఈ తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రసాయనాలతో కూడిన కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ.. శాశ్వతంగా నల్ల రంగులో ఉండలేకపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది వీటిని వాడిన కొన్ని నెలల్లోనే మళ్లీ తెల్ల జుట్టు దర్శనమిస్తోంది. కాబట్టి వీటిని ఎన్నిసార్లు వినియోగించినప్పటికీ ఎలాంటి లాభం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే తెల్ల జుట్టును శాశ్వతంగా నల్ల జుట్టుగా మార్చుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.


తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారికి కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని మిశ్రమంగా తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని వారంటున్నారు. చుండ్రు కారణంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ కరివేపాకు రెమిడీ ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు కరివేపాకు తయారుచేసిన హెయిర్ మాస్క్ ను వినియోగించడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ కరివేపాకు హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు కరివేపాకు, చిన్న కప్పు పెరుగు, నాలుగు టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిక్సీలో కరివేపాకును వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. అందులోనే పక్కన పెట్టుకున్న పెరుగును వేసి బాగా మిక్సీ పట్టుకొని, నూనె వేసుకుని మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే సులభంగా కరివేపాకు హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే. ఈ హెయిర్ మాస్క్ ను క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు నిగనిగలాడుతుంది.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook