COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Hair Mask For White Hair: వర్షం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో వాతావరణంలో తేమ తీవ్రంగా పెరుగుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం, తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి క్రమంలో జుట్టు పై ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తేమ కారణంగా జుట్టు సమస్యలు మరింత తీవ్రతరమయ్యే ఛాన్స్‌ ఉంది. చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం చాలా హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా ఇంట్లో లభించే పలు వస్తువులతో తయారు చేసిన హెయిర్‌ మాస్క్ వాడాల్సి ఉంటుంది.


తెల్ల జుట్టును తగ్గించే హెయిర్‌ మాస్క్‌లు:
హనీ హెయిర్ మాస్క్‌:

తేనె చర్మానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రాండెడ్‌ కంపెనీలు ఎక్కువగా సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే తేనెను జుట్టుకు వినియోగించడం వల్ల పొడి జుట్టు, తెల్ల జుట్టు, ఇతర జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 


Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  


హనీ హెయిర్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా 3 టేబుల్‌ స్పూన్ల తేనె, 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వీటన్నింటిని ఒక గిన్నెలో వేసుకుని మిక్స్‌ చేయాలి. ఇలా బాగా మిక్స్‌ చేసుకున్న తర్వాత జుట్టుకు అప్లై చేసి, చివరికి జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. 


దాల్చిన చెక్క హెయిర్ మాస్క్‌:
దాల్చిన చెక్కలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. దీనిని వినియోగించిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ హెయిర్‌ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనెను అర కప్పు, అర కప్పు తీసుకుని బౌల్‌ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇలా మిక్స్‌ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి బాగా 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook