Diabetes Test in the Morning: సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు వైద్యున్ని సంప్రదించే సమయంలో ఉదయం పూట బ్లడ్ షుగర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకురండి..  అని చెప్తుంటారు అవునా!.. ఇలా ఎందుకు తీసుకురమ్మంటారో తెలుసా..?  పోనీ.. ఈ టెస్ట్ ను మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి సమయంలో అసలు చేయినించరు.  ఎందుకంటే ఉదయం పూట శరీరంలో గ్లూకోస్ స్థాయి పెరుగుతుంది. ఇది మన శరీరంలో రోజు జరిగే ప్రక్రియ. ఉదయం మరియు రాత్రి కి మధ్య జరిగే వాటి వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం పూట శరీరంలో జరిగే మార్పులు 
ఉదయాన్నే మన శరీరంలో కొన్ని హార్మోన్ సంబంధిత మార్పులు సంభవిస్తాయి. డయాబెటిస్ ఉన్న లేకున్నా బ్లడ్ షుగర్ స్థాయి ఖచ్చితంగా పెరుగుతుంది. డయాబెటిస్‌ లేని వారి శరీరం అనేక విషయాలను సమతుల్యం చేయడం కోసం ఎక్కువ ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. డయాబెటిస్ కలిగిన వారు.. ఎంత నిర్దిష్టమైన డైట్ పాటించినా.. రాత్రి భోజనం మరియు అల్పాహారం మధ్య చక్కెర స్థాయిలు పెరిగితే, ఈ వ్యాధితో బాధపడేవారి శరీరంలో ఇన్సులిన్ సాధారణంగా పని చేయదు.రాత్రి సమయంలో విడుదలయ్యే ఎపినెఫ్రిన్, గ్లూకాగాన్ మరియు కార్టిసాల్ వంటి పెరుగుదల హార్మోన్లు మీ శరీరం యొక్క ఇన్సులిన్ నిరోధకతను బలపరుస్తాయి. ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. 


ఉదయం బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగడానికి గల కారణాలు.. 


1. ఎక్కువ లేదా తక్కువగా మందులు తీసుకోవడం.  


Also Read: Infinix Note 30 5G మొబైల్‌ను రూ. 1,190కే పొందండి..ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఇవే.. 


2. ముందు రోజు రాత్రి శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం.  


3. పడుకునే ముందు కొన్నింటిని తినడం.  


బ్లడ్ షుగర్ నియంత్రణకు ఏం చేయాలి..?  


శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరిగినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దాని వల్ల కిడ్నీ సమస్యలు లేదా గుండెపోటు  వంటి వ్యాధుల వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో గ్లూకోస్ స్థాయిని


నియంత్రించే ఉపాయలు ఇవే.. 


- సాయంత్రం పూట తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి పూట 8 నుండి 9 మధ్యలో భోజనం చేయాలి.  


- రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం అటు ఇటు మంచిది.  


- డాక్టర్ సలహా లేకుండా ఏ మందులు వేసుకోకూడదు.. ఎందుకంటే ఏ టాబ్లెట్ బ్లడ్ షుగర్ ని పెంచుతుందో తెలియదు.  


- రాత్రి సమయంలో తీపి వస్తువులను తినకూడదు. తీపి తినడం వల్ల నష్టం కలుగుతుంది.  


- రాత్రి పడుకునే ముందు ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే స్నాక్స్ తినాలి.


Also Read: Flipkart Big Billion Days Sale 2023: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ఆఫర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook