5 Vitamins for Women: అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండటం అవసరం. ఎందుకంటే శరీరంలో కొన్ని విటమిన్ల లోపంతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందం కోసం శరీరంలో కొన్ని విటమిన్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. శరీరంలో ఆ విటమిన్ల లోపం లేకుండా చూసుకుంటే ఆకర్షించే అందం మీ సొంతమౌతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా శరీరానికి అంతర్గత పోషక పదార్ధాలు పుష్కలంగా అందినప్పుడే బాహ్య అందం సాధ్యమౌతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే మహిళలకు ఆరోగ్యం, అందం విషయంలో హాని కలుగుతుంది. ఆరోగ్యం కోసం ఎలాంటి పోషకాలు అవసరం, అందంగా కన్పించేందుకు ఏ విధమైన న్యూట్రియంట్లను డైట్‌లో చేర్చుకోవాలనే వివరాలు తెలుసుకుందాం..


విటమిన్ 'A':


మహిళల వయస్సు 40-45 చేరగానే మెనోపాజ్, హార్మోన్ మార్పులు వస్తుంటాయి. ఈ సందర్భంగా మహిళల చర్మం, శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. దీనికోసం విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవల్సి ఉంటుంది. విటమిన్ ఎ పొందేందుకు బొప్పాయి, ఆనపకాయ, పాలకూర వంటి పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి. 


విటమిన్ 'B9':


గర్భిణీ మహిళల్లో కూడా చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో విటమిన్ బి9 అవసరమౌతుంది. దీనినే ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే పుట్టే పిల్లల్లో సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం తృణధాన్యాలు, ఈస్ట్, బీన్స్ తీసుకుంటే విటమిన్ బి9 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం తొలగిపోతుంది. 


విటమిన్ 'D':


వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకల సంబంధిత సమస్యలు పెరుగుతుంటాయి. దీనికోసం కాల్షియం సహా విటమిన్ డి అవసరం ఉంటుంది. విటమిన్ డి సాధారణంగా సూర్య కిరణాల్లో కావల్సినంత లభిస్తుంది. సోయాబీన్స్, వెన్న ఫ్యాటీ ఫిష్, గుడ్లు, మష్రూం, పాలు, పన్నీర్ వంటి పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. 


విటమిన్ 'E':


అందంగా ఉండాలని ప్రతి మహిళకు, ప్రతి అమ్మాయికి ఉంటుంది. దీనికోసం శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ ఇ ఇందుకు దోహదపడుతుంది. విటమిన్ ఇ తో కేశాలు, చర్మం, ముఖం, గోర్లు ఇలా శరీరంలో ప్రతి అంగం అందంగా కన్పిస్తుంది. మెరుపు వస్తుంది. నల్ల మచ్చలు, ముడతలు దూరమౌతాయి. విటమిన్ ఇ కోసం పాలకూర, బాదం, పీనట్ బటర్ వంటి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.


విటమిన్ 'K':


మహిళలకు తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య పీరియడ్స్. ఈ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. డెలివరీ సమయంలో కూడా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నియంత్రించేందుకు విటమిన్ కే చాలా అవసరం. అందుకే పచ్చని కూరగాయలు, సోయాబీన్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది.


Also Read: Face Cleanup Tips: ఈ ఫేస్ క్లీనప్‌తో ముఖం మిళమిళ 2 రోజుల్లో మెరవడం ఖాయం!


Also Read: Ritika Nayak Pics : లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ.. రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook