World Blood Donor Day 2021: ప్రతి ఏడాది రక్తం సరైన సమయంలో దొరకక కొన్ని వేల ప్రాణాలు పోతుంటాయి. రక్తం యొక్క ప్రాధాన్యాత తెలిపేందుకు, రక్తదానంపై అవగాహనా పెంచడానికిగానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సకాలంలో మీరు చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాల్ని కాపాడుతుంది. రక్తదానంతో కొన్ని సందర్భాలలో తల్లి, శిశువు ఇద్దరి ప్రాణాలు దక్కుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరల్డ్ బ్లడ్ డోనర్ డే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా 2004లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day) నిర్వహించింది. అయితే జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. రక్తవర్గాలను కనిపెట్టిన కార్ల్ లాండ్‌స్టీనర్ 1868లో ఇదే రోజున జన్మించారు. ఏబీఓ రక్తగ్రూపుల వ్యవస్థను ఆయన కనిపెట్టినందుకుగానూ, ఆయన సేవలకు గుర్తింపుగా నోబెల్ బహుమతి అందుకున్నారు.


Also Read: ఈ విషయాలు తెలిస్తే మీరూ రక్తదానం చేస్తారు


ప్రాముఖ్యుత
ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి మూడు నుంచి నెలల మధ్య కాలంలో రక్తదానం చేయాలని అందుకోసం ప్రత్యేకమైన రోజును డబ్ల్యూహెచ్‌వో తీసుకొచ్చింది. కొందరిలో అధిక రక్తపోటు (Health Tips For High BP) లాంటి సమస్యలు తలెత్తుతాయి.


Also Read: Steroids for Covid-19 Treatment: ఆ కోవిడ్19 బాధితులకు స్టెరాయిడ్స్‌ వాడకం చాలా ప్రమాదకరం


ఈ ఏడాది థీమ్
World Donor Day 2021 Theme : ప్రతి ఏడాది ఏదైనా ఒక థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. ఈ ఏడాది రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనే థీమ్‌ను ప్రకటించింది. కనుక ఎవరికైనా అవసరం ఉందని తెలిస్తే కచ్చితంగా రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని, ఆ అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.  ఈ ఏడాది ఇటలీ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2021ను నిర్వహిస్తోంది. నేషనల్ బ్లడ్ సెంటర్ కేంద్రగా ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసి రక్తం ప్రాధాన్యత, రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తుంది.


Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook